అప్పుడే తెలుగు మార్కెట్ పై కన్నేశాడా..?

మార్కెట్ సౌత్ మూవీ ఇండస్ట్రీలో ట్రెండ్ మారుతోంది.. స్పాన్ పెరుగుతోంది. ఒక భాషలో స్టార్ మరో భాషలోనూ నటిస్తూ వెళుతున్నాడు. ఈకొత్త ట్రెండ్ కు ముందు తెలుగు పరిశ్రమే వేదిక అవుతోంది. తమిళ్ టాప్ అండ్ స్టార్ హీరోలు తెలుగులో స్ట్రెయిట్ మూవీస్ చేస్తున్నారు. అందులో అక్కడ మీడియం రేంజ్ లో టాప్ అనిపించుకున్న శివకార్తికేయన్ కూడా ఉన్నాడు. జాతిరత్నాలు దర్శకుడితో ప్రిన్స్ అనే సినిమా చేస్తోన్న శివకార్తికేయన్ లేటెస్ట్ గా మరో తెలుగు ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. మరి ఈసారి దర్శకుడెవరా అనుకుంటున్నారు కదా..? జస్ట్ వాచ్ దిస్.తమిళ్ నుంచి డబ్ అయిన సినిమాల ద్వారా తెలుగులోనూ శివకార్తికేయన్ కు అభిమానులున్నారు. డిఫరెంట్ కంటెంట్స్ ను సెలెక్ట్ చేసుకుంటూ కోలీవుడ్ నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు. ఎస్కే అని ఫ్యాన్స్ అంతా పిలుచుకునే శివకార్తికేయన్ రీసెంట్ గా నటించిన వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలు తెలుగు ఆడియన్స్ కు ఓ రేంజ్ లో మెప్పించాయి.

రెండూ తెలుగులోనూ బాగా ఆడాయి. దీంతో ఇక డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ఎస్కే. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ప్రిన్స్ అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ టైమ్ లో మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పి సర్ ప్రైజ్ చేశాడు ఎస్కే.సోగ్గాడే చిన్నినాయనాతో దర్శకుడుగా పరిచయమై మంచి విజయం సాధించిన కళ్యాణ్‌ కృష్ణ డైరెక్షన్ లో శివకార్తికేయన్ రెండో తెలుగు సినిమా రాబోతోంది. తెలుగు సినిమా అంటే ఇక్కడి ప్రొడ్యూసర్ కాదు. తమిళ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకడైన గ్నానవేల్ రాజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అంటే తెలుగు దర్శకుడు చేస్తున్న సినిమా అన్నమాట. బై లింగ్వుల్ గా రాబోతోన్న ఈ మూవీతో శివకార్తికేయన్ తెలుగు మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోవచ్చు. మరి ఈ ప్రయత్నంలో ఎస్కే సక్సెస్ అవుతాడా లేదా అనేది చూడాలి.

Related Posts