ఆచార్య ట్రైలర్ టాక్.. మాటలు తప్ప మేటర్ లేదే..?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఫైనల్ గా ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఇక చెప్పినట్టుగానే ట్రైలర్ ను టైమ్ కు విడుదల చేశారు. ఆశ్చర్యంగా యూ ట్యూబ్ లో కూడా ముందుగానే విడుదదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ ఆసాంతం మెగా వైబ్రేషన్ తోనే కనిపించింది. ముందుగా రామ్ చరణ్ తో ఓపెన్ అయిన ట్రైలర్ లో చూపించిన డైలాగ్స్ చూస్తే బలే ఉన్నాయి. ‘‘దివ్య వనమొక వైపు.. తీర్థజలమొక వైపు.. నడుమ పాదఘట్టం.. ఇక్కడందరూ సౌమ్యులు, పూజలు పునస్కారాలు చేసుకుంటూ కష్టాలొచ్చినప్పుడు అమ్మోరు తల్లి మీద భారం వేసి బిక్కు బిక్కుమంటూ ఉంటావేమో అని పొరపడి ఉండొచ్చు.. ఆపదొస్తే ఆ అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకు పంపుద్ది’’.. ‘‘ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతది’’ అంటూ రామ్ చరణ్ వాయిస్ తో స్టార్ట్ అయింది ట్రైలర్.

ఆ ఆపదను తప్పించేందుకు వెళ్లిన చరణ్ తర్వాత మెగా ఎంట్రీ కూడా మాసివ్ గా మొదలైంది. ‘‘పాదఘట్టం వాళ్ల గుండెల మీద కాలేస్తే ఆ కాలు తీసేయాలంట.. కాకపోతే అది ఏ కాలా అని’’ అంటూ మెగా డైలాగ్ కూడా పాదఘట్టం వారికి అండగా నిలిచేందుకు వచ్చిన క్యారెక్టర్ గా తేల్చివేసింది.
కాకపోతే ట్రైలర్ లో మాస్ ఎలివేషన్స్ తప్ప మేటర్ పెద్దగా కనిపించడం లేదు. ఉన్నంతలో ఒకప్పుడు నక్సలైట్ గా చిరంజీవితో కలిసి అడవిలో తిరిగిన రామ్ చరణ్ ఏవో కారణాలతో పాదఘట్టంకు వస్తాడు. అక్కడి సమస్యలను పరిష్కరించే క్రమంలో మరణిస్తాడు. అతని మరణం తెలిసిన మెగాస్టార్ ఆచార్యగా అక్కడికి వచ్చిన తన మాజీ కామ్రేడ్ కోరికను నెరవేరుస్తాడు అనేది సూత్ర ప్రాయంగా కనిపిస్తోన్న కథ.

మరి ఇదే కథైతే పెద్ద గొప్పగా ఏం లేదనే చెప్పాలి. నిజానికి ఈ కథను శ్రీకాకుళ సాయుధ పోరాట యోధుడు సుబ్బారావు పాణిగ్రాహి కథను పోలి ఉంటుందని ఆ మధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి. చూస్తోంటే రామ్ చరణ్ పాత్రను ఆ కోణంలోనే రాసుకున్నారా అనిపిస్తోంది. ఏదేమైనా మెగా ఫ్యాన్స్ కు ఈ ట్రైలర్ నచ్చవచ్చేమో కానీ.. నిజంగా గొప్పగా అయితే లేదు.
బట్ ఇప్పుడు హిందూత్వ దందా బాక్సాఫీస్ వద్ద బాగా పనిచేస్తోంది కాబట్టి.. ఈ కోణంలో ఇది కూడా హిందువుల సినిమాగా బాక్సాఫీస్ వద్ద గెలుచుకునే అవకాశం ఉంది.

Related Posts