ఎన్టీఆర్ ప్లానింగ్ పై అభిమానుల అసంతృప్తి

క్రేజ్ పెరుగుతున్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడం సినిమా ఇండస్ట్రీలో చాలా అవసరం. ఆ విషయంలో ఎన్టీఆర్ ప్లానింగ్ సరిగా లేదనే కంప్లైంట్స్ ఫ్యాన్స్ నుంచి బాగా వస్తున్నాయీ మధ్య. కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఎన్టీఆర్ ప్లానింగ్ విషయంలో మాత్రం అభిమానులు అసంతృప్తిగానే ఉన్నారనేది నిజం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ కంటే కాస్త తగ్గించారు అని ఫీల్ అవుతున్నారు వాళ్లు. అయినా తనదైన నటనతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను మెస్మరైజ్ చేసి.. చరణ్ కు సమానంగా క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో అంటే ఎన్టీఆర్ గొడవ లేదు. కానీ ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ఇమేజ్ ను కంటిన్యూ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా నెక్ట్స్ లెవెల్ ప్లానింగ్ ఉండాల్సిందే. ఈ విషయంలోనే ఎన్టీవోడు వెనకబడి ఉన్నాడనేది విశ్లేషకుల అంచనా కూడా.

ఆలస్యంగా వచ్చినా.. ఆర్ఆర్ఆర్ అందరి నమ్మకాన్ని నిలబెట్టింది.. ఇండియాలో మరో బెస్ట్ యాక్టర్ ఉన్నాడని దేశం మొత్తానికి తెలిసేలా చేసింది. పైగా ప్రమోషన్స్ లో కంట్రీమొత్తం ఆకట్టుకునేలా చేశాడు ఎన్టీఆర్. అందుకే అతని సినిమా వస్తోందంటే ఇకపై ప్యాన్ ఇండియన్ లెవెల్లో ఆడియన్స్ చూస్తారు. అంటే తర్వాతి సినిమానూ అలాగే ప్లాన్ చేసుకుని ఉండాలి. బట్.. ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు. కొరటాల సినిమా అంటే సందేశాత్మకంగా ఉంటూ కమర్షియల్ యాంగిల్ కనిపిస్తుందని చెబుతారు. బట్.. నిజానికి ఆయన సినిమాల్లో కంటెంట్ ఏమంత గొప్పగా ఉండదు. వరుస విజయాలున్నా.. అవేవీ ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఆకట్టునేంత స్టఫ్ ఉన్న కథలు కావు. ఈ కారణంగానే కొరటాల సినిమాలు కాసులు తెచ్చినా.. అవార్డులు తేలేదు.

ఇలాంటి దర్శకుడుతో ఇప్పుడు సినిమా చేస్తే అది కేవలం తెలుగు వరకే పరిమితం అవుతుందనేది అభిమానుల అంచనా. కొరటాల కాకుండా ఎప్పటి నుంచో వినిపిస్తోన్న ప్రశాంత్ నీల్ తోనే సినిమా చేస్తే బావుంటుందనేది వారి అభిప్రాయం. బట్.. కొరటాలకే ఓటు వేశాడు ఎన్టీఆర్. ఆ తర్వాత బుచ్చిబాబుతో సినిమా అంటున్నారు. ఇదింకా కన్ఫార్మ్ కాలేదు కానీ.. ఇదో స్పోర్ట్స్ డ్రామా అనే రూమర్ మాత్రం ఉంది. ఇవాళా రేపు స్పోర్ట్స్ డ్రామా అంటే కంప్లీట్ గా అందరూ ఊహించదగిన కథ, కథనాలే ఉంటున్నాయి. అయితే డ్రగ్స్, లేదంటో స్పోర్ట్స్ బోర్డ్స్ లో ఉండే రాజకీయాలు.. ఎలా చూసినా వీటి చుట్టే తిరిగే కథనం.. చివరికు హీరో గెలుపుతోనే ముగుస్తుంది. సో.. ఇదేమంత సేఫ్ లైన్ కాదు.
మొత్తంగా ప్యాన్ ఇండియన్ స్థాయిలో ఆర్ఆర్ఆర్ తో వచ్చిన క్రేజ్ ను డబుల్ చేసుకోవాల్సిన తరుణంలో మళ్లీ ఇలా తెలుగు ప్రేక్షకుల దగ్గర ఆగిపోయే దర్శకులతో సినిమాలు చేయడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు. మరి ఈ విషయంలో అభిమానుల ఆశలను నెర�