ఆమిర్ ఖాన్, నాగ చైతన్య ను ఢీ కొంటోన్న సమంత

విడాకులు తర్వాత సమంత చాలా త్వరగా సెటిల్ అయిపోయింది. మెంటల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూ తన పనేదో తను చూసుకుంటోంది. అయితే ఈ సారి మరింత పవర్ ఫుల్ స్టోరీస్ తో వస్తున్నట్టుగా తన లైనప్ చూస్తేనే తెలుస్తుంది. ఈ క్రమంలో మొదటగా రాబోతోన్న చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి హరి – హరీష్ అనే ఇద్దరు డైరెక్టర్లు. విశేషం ఏంటంటే.. తను చివరగా చేసిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఫ్యామిలీమేన్ 2కు కూడా ఇద్దరు దర్శకులు. ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తుందా లేక వీళ్ల అప్రోచ్ నచ్చిందా అనేది చెప్పలేం కానీ.. ఈ సారి కూడా ఒక దర్శకద్వయానికి ఛాన్స్ ఇచ్చింది శామ్.
ప్రస్తుతం సమంతకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అందుకు కారణం ఫ్యామిలీ మేన్ అని వేరే చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ తో వచ్చిన క్రేజ్ వల్లే తనిప్పుడు ఏకంగా ముంబైకి షిఫ్ట్ అవుతోంది. ఇక కథల విషయంలో సమంత ఇప్పుడు పక్కాగా ఉంటోంది. రెగ్యులర్ టైప్ హీరోయిన్ పాత్రలు కాకుండా తనే ప్రధాన పాత్రలో ఉండే కథలకు ప్రాధాన్యం ఇస్తోంది. అలా వస్తోన్న చిత్రమే ఈ యశోద. ప్యాన్ ఇండియన్ మూవీగా వస్తోన్న యశోద మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. దేశవ్యాప్తంగా ఆగస్ట్ 12న యశోద చిత్రాన్ని విడుదల చేయబోతున్నాురు.
ఆగస్ట్ 11న ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింంగ్ చద్దా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నాగచైతన్య ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. అంటే తెలిసీ ఈ చిత్రాన్ని వారితో పోటీగా విడుదల చేస్తున్నారా లేక.. క్యాజువల్ గా ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారా చెప్పలేం కానీ రియల్ లైఫ్ లో గొడవలతో విడిపోయిన వీరు రీల్ లైఫ్ తో బాక్సాఫీస్ వద్దా గొడవ పడబోతున్నారన్నమాట.

Related Posts