ఓటీటీ ప్రియులకు పండగే పండగ

ఒకప్పుడు కొత్త సినిమాలకోసం వెండితెర ఒక్కటే ఆధారం. ఆ తర్వాత ఆ సినిమాలు చాన్నాళ్లకు టి.వి.లోకి వచ్చేవి. కానీ.. ఇప్పుడు ఓటీటీ ప్రధాన ఎంటర్ టైన్ మెంట్ సాదనంగా మారింది. థియేటర్లలో విడుదలైన కొన్ని సినిమాలు రెండు, మూడు వారాలలోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని అయితే డైరెక్ట్ ఓటీటీ అంటూ థియేటర్లలోకి రాకుండానే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. ఇక వెబ్ సిరీస్ ల గురించి ప్రత్యేకంగా చెపక్కర్లేదు. అవి డైరెక్ట్ ఓటీటీలలోనూ విడుదలవుతుంటాయి.

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలోకి సరికొత్త సినిమాలు, వెబ్ సిరీసులు వచ్చేశాయి. మరి.. మార్చి 8న ఓటీటీలో విడుదలైన ఆ సినిమాలు, సిరీస్ ల సంగతేంటో ఇప్పుడు చూద్దాం.

ముందుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ విషయానికొస్తే.. సందీప్ కిషన్ హిట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’ మహాశివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. పొంగల్ కానుకగా విడుదలైన ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’ హిందీ వెర్షన్ ని కూడా మార్చి 8 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది అమెజాన్ ప్రైమ్.

మరో ఓటీటీ జయంట్ నెట్ ఫ్లిక్స్ లో మార్చి 8న రిలీజైన సినిమాలు, సిరీస్ ల జాతర మామూలుగా లేదు. మోస్ట్ అవైటింగ్ రజనీకాంత్ మూవీ ‘లాల్ సలామ్‘ మార్చి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా.. హిందీ మూవీ ‘మేరీ క్రిస్మస్‘, హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘డామ్ సెల్’, ‘బ్లోన్ అవే సీజన్ 4’ వెబ్ సిరీస్, కొరియన్ వెబ్ సిరీస్ ‘ది క్వీన్ ఆఫ్ టియర్స్’ వంటివి మార్చి 8 నుంచి నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చాయి.

ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హిందీ వెబ్ సిరీస్ ‘షో టైమ్’ తెలుగు వెర్షన్ మార్చి 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే.. తమిళ సినిమా ‘ట్రూ లవర్’ కూడా మార్చి 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులోకి వచ్చింది. ఇంకా.. బాలీవుడ్ లో మంచి విజయాన్ని సాధించిన 12th ఫెయిల్ తెలుగు స్ట్రీమింగ్ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్టార్ట్ అయ్యింది.

ఇంకా.. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఈటీవి విన్ లో ‘వళరి’, ఆహా లో ‘బ్రీత్’ మూవీస్ అందుబాటులోకి వచ్చాయి.

Related Posts