శివరాత్రి సినిమాల వసూళ్ల వివరాలు

శివరాత్రి కానుకగా విడుదలైన చిత్రాలలో మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న మూవీ ‘గామి‘. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో నటించిన సినిమా ఇది. చాందిని చౌదరి మరో కీ రోల్ లో కనిపించింది. డెబ్యూ డైరెక్టర్ విద్యాధర్ కాగిత.. క్రౌండ్ ఫండింగ్ తో చేసిన ఈ మూవీ రిలీజ్ కు ముందే విపరీతమైన బజ్ ఏర్పరచుకుంది.

గామి‘ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 3.50 కోట్ల బిజినెస్ జరిగింది. ఇలా మొత్తంగా తెలుగులో రూ. 8.20 కోట్లకు అమ్ముడైంది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్‌లో కలిపి రూ. 2 కోట్లు చేసింది. వీటితో కలిపి మొత్తంగా ఈ చిత్రానికి రూ. 10.20 కోట్లు బిజినెస్ జరిగింది.

ఇక.. తొలిరోజే ‘గామి’ రూ.9.07 కోట్లు వసూళ్లు సాధించింది. ఇక.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ లో కూడా ‘గామి’ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. నిన్నటివరకూ అమెరికాలో క్వార్టర్ మిలియన్ డాలర్స్(2 లక్షల 50వేలు) మార్క్ ని క్రాస్ చేసింది. రెండో రోజు ‘గామి’ చిత్రానికి రెస్పాన్స్ భారీగానే లభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 1.75 కోట్లు వరకూ షేర్‌ను వసూలు చేసింది.
లాంగ్ రన్ లో ‘గామి’ మంచి వసూళ్లు సాధించే అవకాశం పుష్కలంగా ఉంది.

టాక్ తో సంబంధం లేకుండా గోపీచంద్ సినిమాలకు మంచి వసూళ్లే లభిస్తుంటాయి. ‘భీమా‘ విషయంలోనూ అదే జరిగింది. తొలిరోజే ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు రూ.5 కోట్ల వరకూ గ్రాస్ వసూళ్లు దక్కాయి. ‘గామి’ చిత్రంతో పోల్చుకుంటే ఈ వసూళ్లు చాలా తక్కువనే చెప్పాలి.

దాదాపు రూ.11 కోట్లు వ‌ర‌కు ‘భీమా’ థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. దీంతో.. రూ.12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ‘భీమా’ చిత్రం.. శని, ఆదివారం కలెక్షన్లను బట్టే.. సేఫ్ ప్రాజెక్టా? కాదా? అనేది డిసైడ్ అవుతుంది.

కేరళ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఎక్కువ శాతం అగ్ర కథానాయకులు నటించనవే ఉంటాయి. ముఖ్యంగా.. మోహన్ లాల్ సినిమాలు ముందు వరుసలో నిలుస్తాయి. అయితే.. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం రూ.3 కోట్లు బడ్జెట్ తో రూపొందిన బాక్సాఫీస్ ను షేక్ చేసిన ‘ప్రేమలు’ చిత్రం దాదాపు రూ.70 కోట్లు వసూళ్లను సాధించింది. మలయాళంలో విడుదలై నెలరోజులవుతున్నా.. ఇంకా అక్కడ బాక్సాఫీస్ రన్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు తెలుగులోనూ ‘ప్రేమలు’ కలెక్షన్ల బాగానే ఉన్నాయి.

మహాశివరాత్రి కానుకగా మార్చి 8న తెలుగులో విడుదలైంది ‘ప్రేమలు’. అనువాదరూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. ముందుగా వేసిన స్క్రీన్స్ కి ఇప్పుడు ఎక్స్ ట్రా స్క్రీన్స్ పడుతున్నాయి. అయితే.. యూత్ ఫుల్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీకి ఇది సరైన రిలీజ్ టైమ్ కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం స్టూడెంట్స్ అంతా పరీక్షల మూడ్ లో ఉన్నారు. ఈ ప్రభావం ‘ప్రేమలు’ వసూళ్లపై పడొచ్చంటున్నారు సినీ విశ్లేషకులు.

Related Posts