ఆ విషయంలో చిరంజీవి, విజయ్ కాంత్ మధ్య పోలిక

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. కోలీవుడ్ కెప్టెన్ విజయ్ కాంత్ ఇద్దరి సినీ జర్నీ దాదాపు ఒకేసారి మొదలయ్యింది. ఇక.. విజయ్ కాంత్ ను హీరోగా నిలబెట్టిన ‘సట్టం ఒరు ఇరుత్తరై‘ సినిమాని చిరంజీవి తెలుగులో ‘చట్టానికి కళ్లు లేవు‘ పేరుతో రీమేక్ చేశాడు. ఈ రెండు సినిమాలూ మంచి విజయాలు సాధించాయి. ఈ రెండు చిత్రాలకు దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్.

సినీ జర్నీని ఒకేసారి మొదలుపెట్టినట్టే.. పొలిటికల్ జర్నీని సైతం చిరు, విజయ్ కాంత్ లు ఇంచుమించు ఒకేసారి మొదలుపెట్టారు. 2005లో డి.ఎమ్.డి.కె పార్టీని స్థాపించాడు విజయ్ కాంత్. 2006 తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అన్ని సీట్లకు అభ్యర్థులను నిలిపాడు. అయితే.. ఆ ఎన్నికల్లో విజయ్ కాంత్ ఒక్కడే విజయం సాధించాడు. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఆ తర్వాతి జరిగిన 2011 ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీ చేసిన డి.ఎమ్.డి.కె. 29 స్థానాలను దక్కించుకుంది.

2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించాడు చిరంజీవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో జరిగిన ఎన్నికల్లో 294 స్థానాలకు పోటీ చేసిన పి.ఆర్.పి. 18 స్థానాలను మాత్రమే గెలిచింది. అయితే.. చిరంజీవి స్థాపించిన పి.ఆర్.పి. ఎక్కువ కాలం నిలవలేదు. కొంత కాలానికే కాంగ్రెస్ లో విలీనమైంది. ఆ సమయంలో.. తమిళ నటుడు విజయ్ కాంత్ ఒక్క స్థానంతో మొదలై.. ప్రతిపక్ష నాయకుడి హోదా వరకూ వెళ్లాడని.. చిరంజీవి మాత్రం తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడనే కామెంట్స్ వినిపించాయి.

Related Posts