నాగచైతన్య, సమంత మళ్లీ నటిస్టారా..?

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురావడం సాధ్యమేనా..? అంటే కాదు అనే ఎవరైనా చెబుతారు. కానీ ఒక సమాధానం విన్న తర్వాత సాధ్యం కావొచ్చు అనిపిస్తుంది. బట్ మరో ఆన్సర్ తెలిస్తే అసాధ్యం అంటారు. మరి ఈ ఇద్దరూ ఎవరో ఇప్పటికే ఊహించి ఉంటారు కదా..? యస్.. నాగచైతన్య, సమంత. రియల్ లైఫ్‌ ఎమైపోయినా.. రీల్ లైఫ్ లో మాత్రం ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. మళ్లీ ఆ కెమిస్ట్రీని రిపీట్ చేసే సినిమా వస్తోందా అంటే రావొచ్చు అంటున్నాడు చైతూ.. మరి నిజంగా ఈ కాంబో రిపీట్ అవుతుందా..?
సమంత ఫస్ట్ మూవీ ఏమాయ చేశావె. ఈ సినిమా నుంచే ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందని తను చెప్పుకునేది ఒకప్పుడు. అది నిజమా కాదా అనేది వారికే తెలియాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. శామ్ అండ్ చే కు ఫస్ట్ హిట్ గా నిలిచిందీ చిత్రం. ఆ తర్వాత సమంత వెనక్కి తిరిగి చూడలేదు. చైతూ కాస్త ఇబ్బంది పడుతూ ఈ మధ్యే కరెక్ట్ గా కుదురుకున్నాడు. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ఆటో నాగర్ సూర్య. ఈ చిత్రం విడుదల బాగా ఆలస్యం కావడంతో ముందుగా మనం రిలీజ్ అయింది. మనం టైమ్ లోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పుకున్నారు. ఆటో నగర్ యావరేజ్ అయినా మనం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏ మాయ చేశావె వదిలేస్తే.. మిగతా రెండు సినిమాల్లో నిజంగానే చైతూ, శామ్ ల మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. నటన పరంగా సీన్స్ కు తగ్గట్టుగానే అయినా ఓ దగ్గరతనం కనిపిస్తుంది. అదే వీరిద్దరినీ జంటగా మార్చేందుకు ఉపయోపడిందని అనుకోవచ్చు. ఇక చివరగా వచ్చిన మజిలీ మూవీ మరో బ్లాక్ బస్టర్. మజిలీ టైమ్ కు ఇద్దరూ భార్య భర్తలే కావడంతో ఇక్కడ కెమిస్ట్రీ కంటే కూడా ఓ సహజత్వం కుదిరింది. అందుకే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉన్నా.. ఆమె ఎవరికీ గుర్తు లేనంతంగా ఈ ఇద్దరూ సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు.
ప్రస్తుతం నాగచైతన్య, సమంత విడిపోయి ఉన్నారు. అటు శామ్ తన కెరీర్ తను చూసుకుంటోంది. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్‌ జోహార్ లో కరణ్‌.. మీ ఇద్దరూ మళ్లీ అవకాశాలున్నాయా అంటే అస్సలు లేవని చాలా క్లియర్ గా చెప్పింది సమంత. ఇటు చైతన్యను లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో మళ్లీ కలిసి నటిస్తారా అని అడిగితే ఇతను మాత్రం సింపుల్ గా ‘ఇది జరుగుతుందని నేను అనుకోవడం లేదు. జరిగితే మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. అయినా అదంతా ప్రపంచానికే తెలియాలి’ అనిచెప్పేశాడు. సో.. మంచి కథ అనిపిస్తే చేయడానికి చైతూకు ఇబ్బంది లేదు. బట్ శామ్ కు మాత్రం ఇంట్రెస్ట్ లేదు అంటూ సోషల్ మీడియాలో తేల్చేస్తున్నారు కొందరు. మరి నిజంగా వీరు కలిసి నటించే అవకాశం ఉంటుందంటారా..?

Telugu 70mm

Recent Posts

పిడుగులా ఓటిటి లో ఊడిపడిన కృష్ణమ్మ

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

10 hours ago

‘పుష్ప 2’ని కలవరపెడుతున్న రెండు విషయాలు

రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…

10 hours ago

‘మిరాయ్’ ప్రపంచంలోకి మంచు మనోజ్

'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…

11 hours ago

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్స్ రెడీ అవుతున్నాయి..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…

11 hours ago

నలభై రోజుల పాటు ఏకధాటిగా ‘విశ్వంభర’

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…

16 hours ago

Vijay ‘Goat’ completed VFX work

Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…

17 hours ago