నాగచైతన్య, సమంత మళ్లీ నటిస్టారా..?

పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకురావడం సాధ్యమేనా..? అంటే కాదు అనే ఎవరైనా చెబుతారు. కానీ ఒక సమాధానం విన్న తర్వాత సాధ్యం కావొచ్చు అనిపిస్తుంది. బట్ మరో ఆన్సర్ తెలిస్తే అసాధ్యం అంటారు. మరి ఈ ఇద్దరూ ఎవరో ఇప్పటికే ఊహించి ఉంటారు కదా..? యస్.. నాగచైతన్య, సమంత. రియల్ లైఫ్‌ ఎమైపోయినా.. రీల్ లైఫ్ లో మాత్రం ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ ఉంటుంది. మళ్లీ ఆ కెమిస్ట్రీని రిపీట్ చేసే సినిమా వస్తోందా అంటే రావొచ్చు అంటున్నాడు చైతూ.. మరి నిజంగా ఈ కాంబో రిపీట్ అవుతుందా..?
సమంత ఫస్ట్ మూవీ ఏమాయ చేశావె. ఈ సినిమా నుంచే ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉందని తను చెప్పుకునేది ఒకప్పుడు. అది నిజమా కాదా అనేది వారికే తెలియాలి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయింది. శామ్ అండ్ చే కు ఫస్ట్ హిట్ గా నిలిచిందీ చిత్రం. ఆ తర్వాత సమంత వెనక్కి తిరిగి చూడలేదు. చైతూ కాస్త ఇబ్బంది పడుతూ ఈ మధ్యే కరెక్ట్ గా కుదురుకున్నాడు. ఆ తర్వాత వీరి కాంబోలో వచ్చిన ఆటో నాగర్ సూర్య. ఈ చిత్రం విడుదల బాగా ఆలస్యం కావడంతో ముందుగా మనం రిలీజ్ అయింది. మనం టైమ్ లోనే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని చెప్పుకున్నారు. ఆటో నగర్ యావరేజ్ అయినా మనం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏ మాయ చేశావె వదిలేస్తే.. మిగతా రెండు సినిమాల్లో నిజంగానే చైతూ, శామ్ ల మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. నటన పరంగా సీన్స్ కు తగ్గట్టుగానే అయినా ఓ దగ్గరతనం కనిపిస్తుంది. అదే వీరిద్దరినీ జంటగా మార్చేందుకు ఉపయోపడిందని అనుకోవచ్చు. ఇక చివరగా వచ్చిన మజిలీ మూవీ మరో బ్లాక్ బస్టర్. మజిలీ టైమ్ కు ఇద్దరూ భార్య భర్తలే కావడంతో ఇక్కడ కెమిస్ట్రీ కంటే కూడా ఓ సహజత్వం కుదిరింది. అందుకే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉన్నా.. ఆమె ఎవరికీ గుర్తు లేనంతంగా ఈ ఇద్దరూ సినిమాలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయారు.
ప్రస్తుతం నాగచైతన్య, సమంత విడిపోయి ఉన్నారు. అటు శామ్ తన కెరీర్ తను చూసుకుంటోంది. రీసెంట్ గా కాఫీ విత్ కరణ్‌ జోహార్ లో కరణ్‌.. మీ ఇద్దరూ మళ్లీ అవకాశాలున్నాయా అంటే అస్సలు లేవని చాలా క్లియర్ గా చెప్పింది సమంత. ఇటు చైతన్యను లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్స్ లో మ�