రాజమౌళి-సెంథిల్ కాంబోకి బ్రేక్ పడనుందా?

దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకు సంగీత దర్శకుడిగా కీరవాణి ఎలాగో.. రచయితగా విజయేంద్రప్రసాద్ ఎలాగో.. సినిమాటోగ్రాఫర్ గా సెంథిల్ కుమార్ అలాగ. తన సినిమాలకోసం రెగ్యులర్ టెక్నీషియన్స్ నే ఎక్కువగా రిపీట్ చేస్తుంటాడు జక్కన్న. రాజమౌళి తొలి రెండు చిత్రాలు ‘స్టూడెంట్ నంబర్ 1’కి హరి అనుమోలు.. ‘సింహాద్రి’కి కె.రవీంద్ర బాబు కెమెరామెన్స్ గా వ్యవహరిస్తే.. మధ్యలో ‘విక్రమార్కుడు’ కోసం సర్వేష్ మురారి పనిచేశాడు.

ఇక ‘సై’ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ వరకూ రాజమౌళి చిత్రాలన్నింటికీ సెంథిల్ కుమారే సినిమాటోగ్రాఫర్. అయితే.. మహేష్ బాబు సినిమాకోసం వీరి కాంబోకి బ్రేక్ పడబోతుందనేది ఇండస్ట్రీ టాక్. అందుకు ముఖ్య కారణం సెంథిల్ కుమార్ దర్శకుడిగా మారబోతుండడమే. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలామంది టెక్నీషియన్స్ డైరెక్టర్స్ గా మారుతున్నారు. ఈకోవలోనే సెంథిల్ కూడా త్వరలో మెగా ఫోన్ పట్టబోతున్నాడట.

సెంథిల్ ఒకవేళ దర్శకుడిగా మారితే.. ఆ స్థానంలో పి.ఎస్.వినోద్ ని సినిమాటోగ్రాఫర్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట జక్కన్న. దాదాపు పాతికేళ్లుగా సినిమాటోగ్రాఫర్ గా కొనసాగుతున్న పి.ఎస్.వినోద్.. తెలుగులో ‘పంజా, మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి, ధృవ, అల.. వైకుంఠపురములో, వకీల్ సాబ్, సీతారామం’ వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. ప్రస్తుతం మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘గుంటూరు కారం’ చిత్రానికి కూడా ఇతనే సినిమాటోగ్రాఫర్.

Related Posts