‘గుంటూరు కారం’ నుంచి ‘దమ్ మసాల’ సాంగ్

మహేష్ బాబు-త్రివిక్రమ్ క్రేజీ కాంబోలో వస్తోన్న ‘గుంటూరు కారం’ నుంచి మోస్ట్ ఎవైటెడ్ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ‘సర్రు మండుతాది బాబు గొడ్డు కారం.. గిర్రు తిరుగుతాది ఈడి తోటి బేరం.. అంటూ హై ఇన్ఫ్లేమేబుల్ ‘దమ్ మసాలా’ సాంగ్ రిలీజయ్యింది.

‘బుర్రిపాలెం బుల్లోడంటే తెలీనోడు ఎవడూ లేడు..’ అంటూ సూపర్ స్టార్ ని సూపర్ లెవెల్ లో ఎలివేట్ చేస్తున్న ఈ గీతాన్ని ‘సరస్వతి పుత్ర’ రామజోగయ్య శాస్త్రి రాయగా.. సంజిత్ హెగ్డే, తమన్ ఆలపించారు.

రామ్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో కంపోజ్ చేసిన ఫైట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ వస్తున్నట్టు అర్థమవుతోంది. గతంలో ‘అల.. వైకుంఠపురములో’ కోసం ఇలాంటి ప్రయోగాన్ని చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా ఈ లిరికల్ సాంగ్ లో జత చేశారు. ఇక.. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ తనదైన మార్క్ తో ఈ పాటను ఆద్యంతం రక్తికట్టించేలా తీర్చిదిద్దాడు. మొత్తంమీద.. ‘గుంటూరు కారం’ మ్యూజికల్ జర్నీ అయితే మొదలైంది. మరి.. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Related Posts