‘డంకీ’ తో తాప్సీ ఫేట్ మారుతుందా.?

ప్రస్తుతం తాప్సీ ఆశలన్నీ బాలీవుడ్ బాధ్షా షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ సినిమా మీదే పెట్టుకుంది. ‘ఝుమ్మంది నాదం’ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన తాప్సీ..ఆ తర్వాత ప్రభాస్ సరసన ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’, వెంకటేష్ సరసన ‘షాడో’, రవితేజ తో ‘దరువు’ లాంటి చిత్రాలు చేసింది. ఇక్కడ స్టార్ హీరోల సినిమాల్లో నటించినప్పటికీ ఒక్కటి కూడా తాప్సీ ఖాతాలో భారీ హిట్‌గా చేరలేదు.

ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ గ్లామర్ రోల్స్ చేసి క్రేజ్ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘పింక్’, ‘బద్లా’ వంటి పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న మూవీస్ చేసి పాపులర్ అయింది. తాప్సీకి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ, వాటిలో కొన్ని ఫ్లాపులుగా మిగిలి తాప్సీ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. అయితే, ఇప్పుడు తాప్సీ ఆశలన్నీ ‘డంకీ’ మూవీ మీదే పెట్టుకుంది. రాజ్ కుమార్ హిరాణి సినిమాలంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక వరుస హిట్స్‌తో దూకుడుమీదున్న షారుఖ్ హీరో కాబట్టి, తాప్సీకి ఈ మూవీ మళ్ళీ టర్నింగ్ పాయింట్ అవుతుందని బాలీవుడ్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.

Related Posts