సలార్ తో పోటీ అన్నాడు.. సౌండే లేదేం

ప్రభాస్ ను ఢీ కొట్టడం పెద్ద కష్టమా అన్న రేంజ్ లో మాట్లాడాడు. ఆల్రెడీ ప్రభాస్ ను బాక్సాఫీస్ వద్ద ఓడించాను. మరోసారి ఓడిచండం నాకు చాలా ఈజీ అన్నట్టుగా మాట్లాడాడు.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కశ్మీర్ ఫైల్స్ సినిమాతో వందల కోట్లు కొల్లగొట్టాడీ దర్శకుడు. ఆ సినిమాతో పాటు అప్పుడు రాధేశ్యామ్ విడుదలైంది. రాధేశ్యామ్ పోయింది. కశ్మీర్ ఫైల్స్ హిట్(కమర్షియల్ గా మాత్రమే) అయింది. దీంతో మరోసారి ప్రభాస్ ను ఢీ కొడతా అని అతని సలార్ పైనే తన కొత్త సినిమా ది వాక్సిన్ వార్ ను వేశాడు.

మొదట ప్రభాస్ తో నాకు పోటీ ఏంటీ అని చాలా తగ్గి మాట్లాడాడు. కానీ తర్వాత టోన్ పెంచాడు. అతని సినిమాతో పోటీగా వస్తే తప్పేంటీ అన్నట్టుగా మాట్లాడాడు. అఫ్ కోర్స్ అతని మాటల్లో ఏ తప్పూ లేదు. ఏ దర్శకుడికైనా తన ప్రాడక్ట్ మీద నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని బయట ప్రదర్శిస్తే తప్పే కాదు. అతని లక్కో లేక కలిసొచ్చిందో కానీ సలార్ వాయిదా పడింది.


అయితే ఈ నెల 28న విడుదల కాబోతోన్న ది వాక్సిన్ వార్ నుంచి ప్రమోషనల్ గా ఇప్పటి వరకూ ఏ సందడీ కనిపించడం లేదు. కంటెంట్ కు సంబంధించి క్యూరియాసిటీ పెంచే ప్రోమోస్ కానీ, సాంగ్స్ కానీ ఒక్కటీ విడుదల కాలేదు. దీంతో అసలు ఈ సినిమా సెప్టెంబర్ 28న వస్తుందా రాదా అనే డౌట్ అందరిలోనూ మొదలైంది. కాకపోతే ఇలాంటి దర్శకులు, సినిమాలకు ప్రభుత్వాల నుంచి మద్దతు ఉంటుంది. అందుకే పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా కావాల్సినన్ని థియేటర్స్ వస్తాయి. రావాల్సిన ఆడియన్స్ వచ్చేస్తారు. అదే వీరి దీమా కావొచ్చు.

కానీ కశ్మీర్ ఫైల్స్ లో కంటెంట్ తో పాటు నెరేషన్ విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. బట్ అప్పుడున్న ఎమోషన్ లో ఆ మైనస్ లేవీ కనిపించలేదు. ఇప్పుడూ ఎమోషన్ ఉంది. కానీ ఈ సారి ఖచ్చితంగా ఈ మూవీని సినిమాగానే చూస్తారు. అందువల్ల కథ, కథనం విషయంలో తేడాలొస్తే ఆ ప్రభావం రిజల్ట్ పైనా పడుతుంది.

Related Posts