తొలిప్రేమ మళ్లీ అదే థియేటర్ లో

కొన్ని సినిమాలు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషన్స్ ను మిగుల్చుతాయి. ఆ ఎమోషన్ కు కనెక్ట్ అయినవారు అంత సులువుగా ఆ కాస్టింగ్ ను, కథనూ మర్చిపోలేరు. తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది ఇలా ఎమోషనల్ గా అయిన అతికొద్ది సినిమాల్లో పవన్ కళ్యాణ్‌ తొలిప్రేమ కూడా ఉంటుంది. ఈ చిత్రం అప్పట్లో ఇతర హీరోల అభిమానులను కూడా విపరీతంగా మెప్పించింది.

తొలి ప్రేమ తాలూకూ తియ్యదనాన్ని, బాధను, విరహాన్ని, ఓ తెలియని అమాయకత్వాన్ని అంతకు ముందు తరం ప్రేక్షకులు కూడా మరోసారి ఫీలయ్యేలా చేయడంతో పాటు కొత్త తరం వారిని డైరెక్ట్ గా తాకింది. అందుకే ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్‌ కు సొంతంగా ఫ్యాన్ బేస్ స్టార్ట్ అయిందంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆ కాలం ఆడియన్స్ ఈ మూవీని ఓన్ చేసుకున్నారు.

మూవీతో పాటు పవన్ కళ్యాణ్‌ ను కూడా. అప్పటి నుంచి మొదలైన అభిమానం దశాబ్దాలు దాటుతున్నా తరిగిపోవడం లేదు. అంటే అది ఎమోషనల్ బాండ్ గా మారిందన్నమాట. మరి అలాంటి మూవీస్ ను రీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఊహించగలమా. ఇక ఫ్యాన్స్ ఇప్పటికే ఖుషీ చిత్రాన్ని రీ రిలీజ్ చేసి.. ఈ సారి కూడా హయ్యొస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా మార్చారు. ఇక ఇప్పుడు ఎమోషనల్ గా కనెక్ట్ అయిన తొలి ప్రేమను ఈ నెల 30న రీ రిలీజ్ చేయబోతున్నారు.


1998 జూలై 14న అప్పట్లో హైదరాబాద్ సంధ్య థియేటర్స్ లో విడుదలైంది తొలిప్రేమ. విడుదలయ్యే టైమ్ కు పెద్దగా అంచనాలు లేవు అనేది నిజం. బట్ మొదటి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ థియేటర్ అప్పటి నుంచి పవన్ కళ్యాణ్‌ కు ఓ సెంటిమెంట్ గానూ మారింది.

అందుకే రీ రిలీజ్ లో కూడా తొలిప్రేమను సంధ్య థియేటర్స్ లోనే విడుదల చేయబోతున్నారు. కొంతకాలంగా కొత్త సినిమాలేవీ ఆకట్టుకోక సంధ్య థియేటర్స్ వెలవెలబోతున్నాయి. మరి ఈ తొలిప్రేమతో వీరికి మరోసారి 20యేళ్ల క్రితం నాటి జ్ఞాపకాలన్నీ మదిలో మెదులుతాయేమో..? సో ఈ నెల 30న హైదరాబాద్ సంధ్య థియేటర్ లో తొలిప్రేమ మళ్లీ విడుదల కాబోతోందన్నమాట.

Related Posts