నరేష్‌ భార్య మళ్లీ కోర్ట్ కు వెళ్లింది

ఒకప్పుడు కామెడీ హీరోగా రాణించి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెలుగుతున్నాడు వికే నరేష్. అయితే అతను సినిమాల కంటే రియల్ లైఫ్‌ ఇన్సిడెంట్స్ తోనే ఎక్కువ వార్తల్లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ తాజాగా నటి పవిత్ర లోకేష్ ను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈమేరకు ఈ వ్యవహారం మొత్తం కొన్నాళ్లుగా రచ్చ రచ్చ అవుతోంది.

ఈ పెళ్లిపై నరేష్‌ రెండో భార్య మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ మాటకొస్తే వీళ్లు పెళ్లి చేసుకోవడానికి ముందు నుంచే ఆమె ఆగ్రహంగా ఉంది. కొన్ని రోజులు క్రితం బెంగళూరులో నరేష్‌, పవిత్ర ఉన్న ఓ హోటెల్ కు పోలీస్ లతో వెళ్లి మరీ హడావిడీ చేసింది. దానికి నరేష్ ఎలాంటి కౌంటర్స్ ఇచ్చాడో అందరికీ తెలుసు.


ఇక పవిత్రతో తన పవిత్ర ప్రేమ బంధం విలువను తెలిపేలా అతను ఏకంగా సినిమాయే తీసుకున్నాడు. సొంత బ్యానర్ లోనే ఎమ్మెస్ రాజు డైరెక్షన్ లో మళ్లీపెళ్లి అనే సినిమా తీశాడు. గత నెలలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందనేం రాలేదు. అయితే అప్పుడే ఈ సినిమాను విడుదల కాకుండా ఆపాలంటూ నరేష్ రెండో భార్య రమ్య కోర్ట్ లో కేస్ వేసింది. భార్యనైన తనను చులకనగా చూపించారని. అబద్ధాలు చెప్పారనేది రమ్య ఆరోపణ. అప్పటికే ఆలస్యం కావడంతో కోర్ట్ నరేష్ కు అనుకూలంగానే తీర్పునిచ్చింది.


థియేటర్స్ లో ఎవరూ పట్టించుకోకపోవడంతో మళ్లీపెళ్లి ఇప్పుడు అమెజాన్, ఆహా ఓటిటి లోవిడుదల కాబోతోంది. అయితే కోర్ట్ ఆమె పిటిషన్ ను తీసుకుంది. కాకపోతే ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగా అమెజాన్ లో ఈ చిత్రాన్ని స్ట్రీమ్ చేయొద్దని చెప్పింది. అంటే ఇక కేవలం ఆహాలో మాత్రమే మళ్లీ పెళ్లి స్ట్రీమ్ అవుతుందన్నమాట. ఏదేమైనా నరేష్ కు ప్రస్తుతం పవిత్రకాలం నడుస్తున్నట్టుంది.

Related Posts