కృతిశెట్టి.. ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ ఇంప్రెషన్ వేసింది. టాలీవుడ్ కు కాబోయే స్టార్ హీరోయిన్ అని కూడా అనిపించుకుంది. వరుసగా ఆఫర్స్ కొట్టేసింది. యంగ్ హీరోలంతా కృతిశెట్టి కావాలంటూ వెంటపడ్డారు
. బట్ అమ్మడిని బ్యాడ్ లక్ వెంటాడింది. ఏ సినిమా కూడా ఆకట్టుకోలేదు. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి విజయాలు వచ్చినా.. తర్వాత ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ వంటి చిత్రాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద పోయాయి.
ప్రస్తుతం శర్వానంద్ తో ఓ సినిమా చేస్తోంది. అయితే కస్టడీతో తమిళ్ తెరకు కూడా పరిచయం అయిన ఈ బ్యూటీకి ఇప్పుడు కోలీవుడ్ లో వరుస ఆఫర్స్ ఉన్నాయి. అందులో సూర్య, కార్తీ లతో చెరో సినిమా చేస్తోంది. మళయాలంలో కూడా టోవినో థామస్ సరసన ఓ మూవీ చేస్తోంది. అయితే కొన్నాళ్లుగా ఈ బ్యూటీని ఓ కోలీవుడ్ స్టార్ హీరో కొడుకు వేధిస్తున్నాడట.
ఈ విషయాన్ని తనే స్వయంగా కోలీవుడ్ ఇంటర్వ్యూలో చెప్పడంతో అక్కడ హాట్ టాపిక్ అయిపోయింది. ఆ స్టార్ హీరో ఎవరు.. అనేది మాత్రం చెప్పలేదు కానీ.. అతను తనను బాగా ఇరిటేట్ చేస్తున్నాడని చెప్పింది.అతని బర్త్ డే పార్టీకి రావాలని అద పనిగా ఫోన్ లు చేసి విసిగించాడట. తనకు అలాంటివి ఇష్టం ఉండదనీ.. షూటింగ్స్ ఉన్నాయని చెప్పినా వినకుండా ఎంత డబ్బు అడిగినా ఇస్తాను.. తన బర్త్ డే పార్టీకి రావాల్సిందే అని వేధించాడట.
బట్ తను అతని వేధింపులకు లొంగలేదని చెప్పింది. ఇలాంటి సంఘటన ఎదురు కావడం తనకు ఇదే ఫస్ట్ టైమ్ అట. అందుకే మొదట్లో చాలా భయపడ్డానంటూ చెప్పింది కృతిశెట్టి. మొత్తంగా తను చెప్పిన మాటలు కోలీవుడ్ లో సంచలనంగా మారాయి. మరి ఇది తన కెరీర్ పై ఏమైనా ప్రభావం చూపుతుందా లేదా అనేది చూడాలి.
No matter how many heroes we have, there are only a few who have reached…
Elections are going to be held in two Telugu states tomorrow (May 13). While elections…
Most Awaiting Movie 'Double Ismart' Starring Energetic Star Ram. This movie is being made as…
మనకు ఎంతమంది హీరోలున్నా.. నటనలో ఉన్నత శిఖరాలు అధిరోహించిన వారు అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్…
రేపు (మే 13న) రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటుకి ఎన్నికలు జరుగుతుండగా.. తెలంగాణలో…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్‘. ఇప్పటికే సూపర్ డూపర్ హిట్టైన ‘ఇస్మార్ట్ శంకర్‘కి…