రిపబ్లిక్ డే కానుకగా ‘తంగలాన్’

పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే నటులు అరుదుగా ఉంటారు. అలాంటి క్వాలిటీస్ పుష్కలంగా ఉన్న నటుడు విక్రమ్. ముఖ్యంగా ‘శివపుత్రుడు, అపరిచితుడు, ఐ-మనోహరుడు’ వంటి సినిమాల్లో విక్రమ్ చేసిన మేకోవర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక పాత్రకోసం నటులు అంతలా కష్టపడతారా
అనేంతలా ‘ఐ’ సినిమాకోసం ఏకంగా 20 కేజీలు బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ విక్రమ్ పూర్తిస్థాయి మేకోవర్ తో అలరించబోతున్న చిత్రం ‘తంగలాన్’.

బిఫోర్ ఇండిపెండెన్స్ బ్యాక్ డ్రాప్ తో పా.రంజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘అట్టకత్తి, మద్రాస్’ వంటి సినిమాలతో తమిళంలో విలక్షణ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న పా.రంజిత్.. రజనీకాంత్ తో చేసిన ‘కబాలి, కాలా’ సినిమాలతో కమర్షియల్ గానూ సత్తా చాటాడు. ఈ సినిమాలో పొడవాటి జుట్టు, గడ్డం, గోచీతో రస్టిక్ లుక్ లో ఉన్న విక్రమ్ మేకోవర్ ముందు నుంచి హాట్ డిస్కషన్స్ కు కారణమైంది. లేటెస్ట్ గా ‘తంగలాన్’ మూవీ టీజర్ డేట్ తో పాటు.. రిలీజ్ డేట్ పైనా క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

‘తంగలాన్’ టీజర్ నవంబర్ 1న విడుదల కాబోతుంది. ఇక.. పొంగల్ కానుకగా విడుదలవ్వాల్సిన ఈ సినిమాని రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో పార్వతి తిరువోత్తు, మాళవిక మోహనన్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ స్వరపరుస్తోన్న మ్యూజిక్, బి.జి.ఎమ్. ‘తంగలాన్’కి మరో యాడెడ్ అడ్వాంటేజ్. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related Posts