స్కంద టీమ్ కు షాక్ ఇచ్చిన శ్రీ లీల

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన సినిమా స్కంద. ఈ నెల 28న విడుదల కాబోతోందీ చిత్రం. అయితే రిలీజ్ కు ఒక్క వారమే టైమ్ ఉన్నా.. ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదీ చిత్రం. చాలామంది ఈ విషయంలో ఆశ్చర్యపోతున్నారు. ప్రమోషన్స్ కోసం బోయపాటి ఇంకేదైనా ప్లాన్ వేశాడేమో అనుకున్నారు. బట్ ఎంత ప్లాన్ చేసినా ఇంత తక్కువ టైమ్ లో ప్యాన్ ఇండియన్ రేంజ్ లో విడుదల చేయడం అంత సులభం కాదు. ఓ రకంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పూర్తి నిర్లక్ష్యం కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం ఆల్రెడీ ఈ మూవీ టేబిల్ ప్రాఫిట్స్ తో ఉంది. డిజిటిల్ రైట్స్ 98 కోట్ల భారీ ధరకు అమ్ముడుపోయాయి. థియేట్రికల్ రైట్స్ కూడా 60 కోట్లకు అమ్మేశారు. సినిమా తేడా వస్తే థియేట్రికల్ గానే లాస్ అవుతుంది. నిజానికి వీరికి 60కోట్లు సాధించడం అనేది పెద్ద విషయం కాదు. అలాగని ప్రమోషన్స్ చేయకపోవడం మాత్రం ఖచ్చితంగా పెద్ద మైనస్ అవుతుందని చెప్పొచ్చు.


ఇవాళా రేపు భారీ అంచనాలున్న సినిమాలకు కూడా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాంటిది స్కందపై ఇప్పటి వరకూ భారీ అంచనాలు పెట్టుకునే కంటెంట్ ఒక్కటీ కనిపించలేదు. ట్రైలర్ పూర్తిగా బోయపాటి పాత సినిమా చూస్తున్నట్టుగా ఉంది. కాకపోతే హీరో మారాడు అంతే. అవుట్ అండ్ అవుట్ ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లా ఉందీ చిత్రం. పాటలూ అంతంత మాత్రమే ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలనుకుంటే వీరికి హీరోయిన్ శ్రీ లీల కొత్త షాక్ ఇచ్చింది.


ఈ మూవీ ప్రమోషన్స్ కోసం శ్రీ లీల కొన్ని డేట్స్ కేటాయించిందట. ఆ డేట్స్ లో వాళ్లు ప్రమోషన్స్ ప్లాన్ చేయలేదు. ఇప్పుడు సెడన్ గా ప్రమోషన్స్ ను మొదలుపెట్టబోతున్నాం.. మీరు రావాలి అంటే కుదరదంటే కుదరదు అనేసిందట శ్రీ లీల. నా డేట్స్ ఆల్రెడీ అయిపోయాయి. మీరు వేరే ప్లాన్స్ చేసుకోండని మొహమాటం లేకుండా చెప్పిందట. వాస్తవంగా చూస్తే శ్రీ లీల చాలా సినిమాలు చేస్తోంది. వాటికి డేట్స్ అడ్జెస్ట్ చేయడమే కష్టం. అలాంటిది ఇచ్చిన డేట్స్ ను వేస్ట్ చేసుకుని మళ్లీ కావాలంటే తనకే కాదు.. తను పనిచేస్తోన్న సినిమాలకు ప్రాబ్లమ్ అవుతుంది.


అయితే ఏ ప్రమోషన్ లో అయినా హీరోయిన్ లేకపోతే ఖచ్చితంగా అదో పెద్ద వెలితిగానే ఉంటుంది. రీసెంట్ గా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి విషయంలో అనుష్క వచ్చి ఉంటే కలెక్షన్స్ భారీగా ఉండేవి అనేది కాదనలేని నిజం. శ్రీ లీలది అనుష్క రేంజ్ కాకపోవచ్చు. కానీ తనిప్పుడు క్రేజీ హీరోయిన్ కదా.. తను లేకుండా ప్రమోషన్స్ అంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందువల్ల తనను ఒప్పించే ప్రయత్నం చేస్తారేమో చూడాలి.

Related Posts