బాలయ్య అప్పుడే రాలేదు.. ఇప్పుడెలా వస్తాడు

అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి ఉత్సవాల ప్రారంభంతోప ఆటు అన్నపూర్ణ స్టూడియోలో ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ఎందుకు రాలేదు.. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తోన్న ప్రశ్న. అయితే అనవసరమైన ప్రశ్న. ఎందుకంటే.. కొన్నేళ్లుగా నందమూరి బాలకృష్ణ, నాగార్జునకు వ్యక్తిగతంగా చెడింది. వీరి మధ్య మాటలే లేవు. ఎదురుపడ్డా తప్పుకుని పోతారు. అందుకు కారణమైన గొడవలేంటీ అంటే మనం చెప్పలేం. కానీ ఇప్పుడు ఎందుకు రాలేదు అనేది మాత్రం అసంబంధ్ధమైన ప్రశ్న. అసలు అక్కినేని నాగేశ్వరరావుగారు చనిపోయినప్పుడే బాలకృష్ణ రాలేదు. అలాంటిది ఇప్పుడు వస్తాడు అనుకోవడం ఎంత వరకూ కరెక్ట్..?


ఒకప్పుడు నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య మంచి సంబంధ బాంధవ్యాలుండేవి. ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య అప్పుడప్పుడూ విభేదాలున్నా.. ఎప్పుడూ విడిపోలేదు. ఏదైనా కొన్నాళ్లు మాట్లాడకుండా ఉన్నారేమో కానీ.. శతృత్వం అనేది వారి మధ్య కనిపించలేదు. దాన్ని కొనసాగిస్తూనే బాలకృష్ణ, నాగార్జున కూడా మంచి రిలేషన్ మెయిన్టేన్ చేశారు. మరి ఏమైందో కానీ కొన్నాళ్లుగా వీరి మధ్య విభేదాలు వచ్చాయి. అవి సినిమాలకు సంబంధించినవా.. కుటుంబాలకు చెందినవా అనేది వారికి తప్ప ఇంకెవరికీ తెలియదు. అప్పటి నుంచి ఇద్దరి మధ్యా మాటలు లేవు. ఓ సారి నాగార్జున ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు బాలయ్య ఇంటికి కూడా వెళ్లాడని.. కానీ బాలయ్య ఇంట్లో ఉండి లేడని చెప్పించాడనే వార్తలు కూడా కొన్నాళ్ల క్రితం వచ్చాయి. వాటికీ ఆధారాలు లేవు.


ఇటు బాలయ్య ఫ్యామిలీ కూడా నాగార్జునను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఆహ్వానించలేదు. అందుకే నాగ్ కూడా ఆ కుటుంబం నుంచి ఎవరినీ ఆహ్వానించలేదు అనుకుంటున్నారు. ఏదేమైనా ఏఎన్నార్‌ పోయినప్పుడే రాని బాలయ్య ఇప్పుడు వస్తాడా.. పైగా ఈ మధ్య ఓ సినిమా ఫంక్షన్ లో కూడా అక్కినేని తొక్కినేని అంటూ అవమానకరంగా మాట్లాడాడు. అందుకని బాలయ్య ఎందుకు రాలేదు అనే వాదనే అసంబద్ధమైనదని చెప్పాలి.