ఏఎన్నార్ ఫంక్షన్.. ఎన్టీఆర్ రైట్ స్టెప్

అక్కినేని నాగేశ్వరరావు అంటే తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ కళామతల్లికి రెండు కళ్లు. ఆ కళ్లతోనే తెలుగు లోకం వెండితెర వినోదాన్ని చూసింది. అలాంటి ఇద్దరూ వెళ్లిపోయారు. అంతే కాదు.. ఇద్దరికీ ఒక్క యేడాది తేడాలో శతజయంతి కూడా వచ్చింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను గ్రాండ్ గా నిర్వహించారు. ఇప్పుడు 2023- 2024 వరకూ అక్కినేని శతజయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు.

అందులో భాగంగా ముందు నాగేశ్వరరావు గారి విగ్రహాన్ని అన్నపూర్ణ ఫోటో స్టూడియలో ఆయనకు ఇష్టమైన స్థలంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీలోని పెద్దలంతా హాజరయ్యారు. అటు ఏఎన్నార్ అభిమానులను కూడా ఆహ్వానించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేయించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబం నుంచి ఎవరూ హాజరు కాలేదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు అని చాలామంది భావించారు. అతనికి నాగార్జున అంటే అమితమైన ఇష్టం. కానీ జూనియర్ రాలేదు. రాకపోవడం రైట్ స్టెప్ అనేది అంతా చెబుతున్న మాట.


జూనియర్ ఎన్టీఆర్.. తన తాత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరు కాలేదు. ఆ కుటుంబానికి సంబంధించిన ఇష్యూస్ పైనా స్పందించడం లేదు. చంద్రబాబు అరెస్ట్ పై రియాక్ట్ కాలేదని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటికే ఎన్టీఆర్ పై గరం గా ఉన్నాయి. ఈ టైమ్ లో అతను అక్కినేని నాగేశ్వరరావు విగ్రహావిష్కరణకు హాజరైతే ఇంకా అతన్ని పూర్తిగా కార్నర్ చేసే అవకాశం కల్పించినట్టు అవుతుంది. అందుకే ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరు కాలేదు. సొంత తాత ఫంక్షన్ కు రానివాడు ఆ ఫంక్షన్ కు ఎలా వెళతాడు అని కామన్ ఆడియన్స్ కూడా అనుకునే ప్రమాదం ఉంది. ఇవన్నీ తప్పించుకునేందుకే ఎన్టీఆర్.. నాగార్జున ఆహ్వానించినా.. ఈ కార్యక్రమానికి హాజరు కాలేదంటున్నారు.

Related Posts