సాయిధరమ్, కలర్స్ స్వాతి ‘సత్య’కి అవార్డుల పంట

యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత ‘విరూపాక్ష, బ్రో’ సినిమాలతో మళ్లీ గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చాడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. అయితే.. ఈ సినిమాల తర్వాత ‘గాంజా శంకర్’ మొదలైనా.. ఆ చిత్రం గురించి కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేదు. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం కూడా ఉంది. అయితే.. మరోవైపు తన స్నేహితుడు నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ ‘సత్య’ అనే షార్ట్ ఫిలిం చేశాడు.

ఈ ఫిల్మ్ లో సాయిధరమ్ తేజ్ కి జోడీగా కలర్స్ స్వాతి నటించింది. ఆమధ్య ఈ ఫిల్మ్ నుంచి లిరికల్ వీడియో రిలీజ్ చేసి మంచి బజ్ క్రియేట్ చేశారు. మెస్సేజ్ ఓరియెంటెడ్ గా సాగే ‘సత్య’ ఫిల్మ్ కి ఇప్పుడు ఇంటర్నేషనల్ నుంచి అవార్డుల పంట పండుతుంది. లేటెస్ట్ గా ఫ్రాన్స్ లో జరిగిన టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్ లో ఏకంగా ఎనిమిది పురస్కారాలు అందుకుంది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ శబ్ద గ్రహణం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాత, డెబ్యూ డైరెక్టర్, ఇండీ షార్ట్ ఇలా ఈ క్యాటగిరీలన్నిటిలోనూ విజేతగా నిలిచింది. త్వరలోనే ‘సత్య’ రిలీజ్ ప్లాట్ ఫామ్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుందట.

Related Posts