రాజేంద్రప్రసాద్, జయప్రద ‘లవ్ @ 65’

లేటు వయసులో ప్రేమ అనే కాన్సెప్ట్ తో వైవిధ్యంగా రాబోతున్న చిత్రం ‘లవ్ @ 65’. సీనియర్ యాక్టర్స్ రాజేంద్రప్రసాద్, జయప్రద ఈ సినిమాలో జంటగా నటించారు. సునీల్, అజయ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. గతంలో ‘మనసంతా నువ్వే’ వంటి మెమరబుల్ మూవీ అందించిన వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ సంభాషణలు సమకూరుస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్.

Related Posts