HomeMoviesటాలీవుడ్దసరా ముందూ ధమాకా

దసరా ముందూ ధమాకా

-

ఈ నెలలో బిగ్గెస్ట్ ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్. అందుకు తగ్గట్టుగానే వచ్చిన ఖుషీ కొంత వరకూ ఎంటర్టైన్ చేసినా ఎక్స్ పెక్టేషన్స్ అందుకోలేదు. బట్ సెకండ్ వీక్ లో వచ్చిన జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి హిట్ గా డిక్లేర్ అయ్యాయి. ఇక ఈ 15న కొన్ని చిన్న సినిమాలున్నాయి. ఇవి స్కంద, చంద్రముఖి2 పోస్ట్ పోన్ కావడం వల్ల సడెన్ గా రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకున్న సినిమాలు. ప్రమోషన్స్ కు కూడా టైమ్ లేదు. కాబట్టి ఏ మేరకు ఆకట్టుకుంటాయి అనేది చూడాలి.


థర్డ్ వీక్ లో కూడా పెద్ద సినిమాల సందడి లేదు. ఉన్నంతలో 7/జి బృందావన కాలనీ రీ రిలీజ్ కాస్త ఆకట్టుకునేలా కనిపిస్తోంది. బట్ లాస్ట్ వీక్ లో మళ్లీ వరుసగా చిన్నా పెద్ద సినిమాలు సందడి చేయబోతున్నాయి. వీటిలో స్కంద, రూల్స్ రంజన్, పెదకాపు 1, మ్యాడ్, చంద్రముఖి2 చిత్రాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత అందరూ దసరాకే అసలు ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు. కానీ దసరా ముందు కూడా మంచి మీడియం రేంజ్ మూవీస్ ధమాకా ఉండబోతోందని కొత్త రిలీజ్ డేట్స్ అనౌన్స్ మెంట్ చూస్తే అర్థం అవుతుంది.


దసరాకు ముందు అక్టోబర్ 6న డిజే టిల్లు స్క్వేర్ విడుదల అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. రీసెంట్ గా ఆ డేట్ లోకి సుధీర్ బాబు మామా మశ్చీంద్రా వచ్చింది. లేటెస్ట్ గా మంత్ మధు చిత్రం కూడా యాడ్ అయింది. మంత్ ఆఫ్ మధులో నవీన్ చంద్ర, స్వాతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ మధ్య విడుదలైన ఈ మూవీ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ రేస్ లో గట్టి పోటీయే ఇస్తుందంటున్నారు. కంటెంట్ పరంగా ఎక్కువ మందిని అట్రాక్ట్ చేసే అవకాశాలున్నాయి.


ఇక అక్టోబర్ 6కు మరికొన్ని సినిమాలు రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకోబోతున్నాయి. అవన్నీ కూడా మీడియం రేంజ్ నుంచి స్మాల్ రేంజ్ సినిమాల వరకూ ఉండొచ్చు. సో.. దసరాకు రాబోతోన్న టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి, లియో కంటే ముందు ఈ సినిమాలు కూడా బాగానే ఎంటర్టైన్ చేస్తాయి అనుకోవచ్చు. విశేషం ఏంటంటే.. అక్టోబర్ 6 తర్వాత 13 నుంచి హాలిడేస్ మొదలవుతాయి. కానీ ఇప్పటి వరకూ ఆ డేట్ లో కొత్త రిలీజ్ లు ఏం అనౌన్స్ కాలేదు.

ఇవీ చదవండి

English News