ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పిన పృథ్వీరాజ్

‘సలార్’ రిలీజ్ కు కౌంటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో ప్రభాస్ దేవా పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ప్రభాస్ కి దీటైన పాత్రను మలయాళ నటుడు పృథ్వీరాజ్ పోషించాడు. ఈ మూవీలో ప్రభాస్ దేవా, పృథ్వీరాజ్ వరదరాజ మన్నార్ పాత్రలు మంచి స్నేహితులుగా కనిపించబోతున్నారు. తాజాగా ‘సలార్’లో తన పాత్రకు సంబంధించి ఫైనల్ డబ్బింగ్ కరెక్షన్స్ పూర్తయ్యాయని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు పృథ్వీరాజ్.

అంతేకాకుండా ‘సలార్’ కోసం మాతృ భాష మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి ఐదు భాషల్లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాడట. ఇలా ఇన్ని భాషల్లో తాను పోషించిన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడం మొదటిసారని.. దేవా, వరదా పాత్రలు మిమ్మల్ని ఈనెల 22న థియేటర్లలో మీట్ అవుతాయని ఎక్స్ (ట్విట్టర్) లో తెలిపాడు. పృథ్వీరాజ్ గతంలో తెలుగు, తమిళం, హిందీ వంటి పలు భాషల్లో నటించినా.. మలయాళంలో మాత్రం సూపర్ స్టార్ డమ్ సంపాదించాడు. తక్కువ కాలంలోనే అక్కడ వంద సినిమాల మైలురాయిని దాటేశాడు. ప్రస్తుతం ‘సలార్’తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమవుతున్నాడు పృథ్వీరాజ్.

Related Posts