మరోసారి మిలియన్ కొట్టేసిన నాని

తనదైన నేచురల్ యాక్టింగ్ తో కట్టిపడేసే నానికి ఓవర్సీస్ లో విపరీతమైన క్రేజుంది. నాని నటించిన చిత్రాలు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తుంటాయి. అందుకు అతను నటించిన గత చిత్రాలే ఉదాహరణ. ‘ఈగ, ఎమ్.సి.ఎ, నేను లోకల్, భలే భలే మగాడివోయ్, నిన్నుకోరి, జెర్సీ, అంటే సుందరానికి, దసరా’ వంటి చిత్రాలు యు.ఎస్. బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ డాలర్స్ మార్కును దాటేశాయి.

లేటెస్ట్ గా ఈ లిస్టులోకి ‘హాయ్ నాన్న’ కూడా చేరింది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో శౌర్యువ్ తెరకెక్కించిన ‘హాయ్ నాన్న’ ఇటీవలే ఆడియన్స్ ముందుకొచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. రిలీజైంది మొదలు డే బై డే మౌత్ టాక్ తో బాగా పికప్ అవుతోంది. పైగా.. ఈ సినిమాని యు.ఎస్. ఆడియన్స్ కి మరింత దగ్గర చేసేందుకు హీరోహీరోయిన్స్ నాని, మృణాల్ అమెరికాలో విహరిస్తున్నారు. అమెరికాలో వన్ మిలియన్ డాలర్స్ మార్కును దాటేసి రెండో మిలియన్ దిశగా దూసుకెళ్తోంది.

Related Posts