మరోసారి కలిసి నటించబోతున్న ప్రభాస్-అనుష్క

సిల్వర్ స్క్రీన్ పై కొన్ని జంటలను చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అలాంటి క్యూట్ కపుల్ ప్రభాస్-అనుష్క. అభిమానులు ముద్దుగా ఈ జంటను ప్రనుష్క పేరుతో పిలుచుకుంటారు. ‘బిల్లా’తో మొదలైన వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ‘మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2’ చిత్రాలలో మరింత అందంగా ఆకట్టుకుంటుంది. మళ్లీ ఈ జంట కలిసి ఎప్పుడెప్పుడు నటిస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

ప్రభాస్-అనుష్క కలిసి ఇప్పుడు హీరోహీరోయిన్లుగా సినిమా చేయకపోయినా.. వీరిద్దరూ ‘కన్నప్ప’లో నటించే అవకాశాలైతే ఫుష్కలంగా ఉన్నాయనేది ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో రెబెల్ స్టార్ ప్రభాస్ నటించబోతున్న విషయం తెలిసిందే. ఇంకా.. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్.. శాండల్ వుడ్ నుంచి శివరాజ్ కుమార్ వంటి భారీతారాగణం ఈ సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఈ లిస్టులోకి అనుష్క కూడా చేరిందనే టాక్ వినిపిస్తుంది.

ఈ మూవీలో ప్రభాస్ శివుడిగా కనిపిస్తే.. అనుష్క పార్వతి పాత్రలో మెరవనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదేగానీ జరిగితే ‘కన్నప్ప’కి వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు.

Related Posts