‘పుష్ప 2’కి అక్కడ పోటీ లేనట్టే?

ఒకప్పుడు బాలీవుడ్ అంటే ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తానికి పెద్దన్న వంటిది. కానీ.. ఇప్పుడు సమీకరణాలు మారాయి. సౌత్ సినిమాలు పాన్ ఇండియా టచ్ పులుముకున్న తర్వాత బాలీవుడ్ ప్రభావం బాగా తగ్గింది. కంటెంట్ పరంగా, స్టార్ పవర్ పరంగా, మేకింగ్ స్టాండార్డ్స్ పరంగానూ ఇండియన్ మూవీస్ ను హాలీవుడ్ లెవెల్ లో నిలబెట్టేవిగా సౌత్ సినిమాలు రూపొందుతున్నాయి. అందుకే.. యావత్ దేశ సినీ ప్రియులు కొన్ని దక్షిణాది చిత్రాలకోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అలాంటి వాటిలో ‘పుష్ప 2’ ఒకటి.

ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ ‘పుష్ప 2’పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను మరింత రెట్టింపు చేసేలా ఈ సినిమా నుంచి వచ్చిన ‘వేర్ ఈజ్ పుష్ప’.. బన్నీ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన టీజర్ అదరగొట్టాయి. వ్యూస్ పరంగా ఇవి సరికొత్త రికార్డులు కొల్లగొట్టాయి. ‘పుష్ప 2’ క్రేజ్ చూసిన బాలీవుడ్ మేకర్స్.. ఐకాన్ స్టార్ చిత్రానికి సైడివ్వాలని డిసైడయ్యారట.

‘పుష్ప 2’ ఆగస్టు 15న విడుదలకు ముస్తాబవుతోంది. అదే రోజు బాలీవుడ్ నుంచి క్రేజీ మల్టీస్టారర్ ‘సింగర్ ఎగైన్’ రిలీజ్ కు రెడీ అవుతోంది. అజయ్ దేవగణ్ హీరోగా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇప్పటికే సూపర్ హిట్టైన ‘సింగమ్’ సిరీస్ లోని మూడో చిత్రమిది. ఈ సినిమాలో దీపిక పదుకొనె, టైగర్ ష్రాఫ్ వంటి వారు కూడా ఉన్నారు. ఇంకా.. తన కాప్ యూనివర్శ్ లోని హీరోలు అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ కూడా ‘సింగమ్ ఎగైన్’లో నటించే ఛాన్స్ ఉందట. క్రేజీ మల్టీస్టారర్ గా బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న ‘సింగమ్ ఎగైన్’ను ‘పుష్ప 2’తో పోటీకి దింపడం సరికాదని భావిస్తున్నాడట రోహిత్ శెట్టి. త్వరలోనే.. ఈ మూవీకి కొత్త డేట్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

Related Posts