పెదకాపు 1 .. బ్లాక్ బస్టర్ ట్రైలర్

శ్రీకాంత్ అడ్డాల.. ఇప్పటి వరకూ ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీస్ తోనే ఆకట్టుకున్నాడు. అతనికంటూ సెపరేట్ సెక్షన్ ఆడియన్స్ ఉన్నారు. బట్ ఫస్ట్ టైమ్ తనలోని మాస్ డైరెక్టర్ ను బయటకు తీశాడు. అది కూడా ఊరమాస్. తనలో ఈ యాంగిల్ ఉందని పెదకాపు 1 టీజర్ వచ్చే వరకూ ఎవరికీ తెలియదు. ఆ టీజర్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. శ్రీకాంత్ లో ఇంత ఫైర్ ఉందా అనుకున్నారు. టేకింగ్ నుంచి షాట్స్ వరకూ అబ్బో అనిపించేశాడు. అయితే ట్రైలర్ తో అంతకు మించిన కంటెంట్ చూపించాడు శ్రీకాంత్ అడ్డాల.

కథలోని మెయిన్ ప్లాట్ చూస్తే కొత్తది కాదు. కానీ ఇది ఎప్పుడూ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేదే.. ” మీకే అంత ఉంటే మాకెంత ఉండాలి” అనే ఒక వర్గం పై తిరుగుబాటు చేసే యువకుడి కథ ఇది. మీకే అంతుంటే అనే మాట అవతలి అనడానికి కారణం క్యాస్ట్ అండ్ క్యాష్ అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనిషిని మనిషిగా చూడని మనస్తత్వంపై తిరగబడాలంటే కూడా భయపడే జనానికి ఓ కుర్రాడు కాపు కాస్తే. అతనే వారికి పెద కాపుగా మారితే అనే పాయింట్ ఈ ట్రైలర్ లో కనిపిస్తోంది.


” ఒక ఆడది నూతిలో పడి, ఆకాశం తప్ప ఆదుకునేవాడు లేక, అరిస్తే వినిపించుకునేవాడు లేక వెళ్లిపోయింది. ఇలాంటిది ఒక కథగాదు.. వంద వంద వంద కథలున్నాయ్.. ఎక్కడో మారుమూలున్నవాడి బాధగూడ నా బాధన్జెప్పి కాపాడేంత ఇదుందా నీ పార్టీకి..” అంటూ తినకెళ్ల భరణి.. నాగబాబుతో చెప్పే డైలాగ్ తో ప్రారంభమైంది ట్రైలర్. దీన్ని బట్టే అక్కడ హత్యలు ఎంత సాధారణమో తెలుస్తుంది. అక్కడి నుంచి ఏ సబ్ ట్రాక్స్ లేకుండా డైరెక్ట్ గా పాయింట్ తోనే కంటిన్యూ అయింది ట్రైలర్. ముఖ్యంగా ఈ సినిమాలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. అతని పాత్ర చెప్పే .. ” మనిషిలో కసి తగ్గినా కనికరం పెరిగినా.. ఆడు మనోడైనా పరాయోడైనా.. ” చంపేయాల్సిందే అన్నట్టుగా ఉన్న డైలాగ్ ను బట్టి చూస్తే అతనిది నెగెటివ్ రోల్ అని తెలుస్తుంది..


” మీద చెయ్యేసినప్పుడే తలకాయలు తీసుంటే నా కొడకా ఇంత దూరం వచ్చుండేది కాదు” అంటూ హీరో చెప్పిన డైలాగ్ ను బట్టి.. ఈ కథలో అతనికి కసి పుట్టడానికి చాలా అరాచకాలే జరిగాయని అర్థం చేసుకోవచ్చు. ఎలా చూసినా ఓ కంప్లీట్ మాస్ కంటెంట్ తో కనిపిస్తోందీ ట్రైలర్. ఆర్టిస్టులు బిగ్గెస్ట్ ఎసెట్ కాబోతున్నారని రావు రమేష్, తనికెళ్ల భరణి, నాగబాబు, అనసూయ, శ్రీకాంత్ అడ్డాల పాత్రలను, వారి చూపులూ చూస్తే తెలుస్తుంది. వీరికి మించిన ఇప్పటి వరకూ క్లాస్ మ్యూజీషియన్ అనిపించుకున్న మిక్కే జే మేయర్ ఫస్ట్ టైమ్ తనలోని మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ను చూపించాడు. ఓ తమిళ్ మూవీ ట్రైలరా ఇది అనేలా ఉంది అతని ఆర్ఆర్. రా కంటెంట్ తో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్ తో ఇది ఇప్పటి వరకూ ఉన్న ఊహలను మించి ఉండబోతోందని తేల్చేశాడు శ్రీకాంత్ అడ్డాల.


పెదకాపుకు మరో రెండు భాగాలు కూడా ఉంటాయని ముందే చెప్పారు. ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీ వాత్సవ హీరోయిన్. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై అఖండ ఫేమ్ మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఓవరాల్ గా చూస్తే పెదకాపు 1 ట్రైలర్ చూస్తే ఓ బ్లాక్ బస్టర్ మూవీ వస్తోంది అనిపించేలా ఉంది.

Related Posts