మా అమ్మాయి ఆ హీరోతో నటించదు

ఏ హీరోయిన్ అయినా ఓ బెస్ట్ డెబ్యూను కోరుకుంటుంది. అందుకోసం మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఈ హీరోయిన్ తండ్రేమో.. మంచి హీరో ఉంటే చాలు అనుకుంటున్నాడు. అందుకే తన కూతురును పరిచయం చేయాల్సి వస్తే ఏ హీరో అయితే బెటరో.. ఏ హీరో కాదో కూడా చెప్పేస్తున్నాడు. ఆ హీరోయిన్ జాన్వీ కపూర్. తండ్రి బోనీ కపూర్. శ్రీదేవి కూతురుగా బాలీవుడ్ లో పరిచయం అయ్యి అక్కడ వరుస సినిమాలు చేస్తోన్న హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఫస్ట్ టైమ్ సౌత్ లో ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో పరిచయం అవుతుంది. నిజానికి తన సౌత్ డెబ్యూ ఓ తమిళ్ సినిమాతో ఉంటుందని ఆ మధ్య చాలా వార్తలు వచ్చాయి. బట్ అది తెలుగు ఇండస్ట్రీలో మొదలైంది.

జాన్వీ కపూర్ ను తమిళ్ లో తీసుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు చేస్తున్నవారిలో హీరో ధనుష్ కూడా ఉన్నాడు. ధనుష్ కు ప్యాన్ ఇండియన్ మార్కెట్ ఉంది. హిందీలోనూ మంచి క్రేజ్ ఉంది. బట్ బోనీ కపూర్ మాత్రం తన కూతురు దనుష్ తో పరిచయం కాదు. అలా చేయడం తనకు ఇష్టం లేదు అని చెబుతున్నాడట. అందుకే ధనుష్ మూవీ ఆఫర్ వచ్చినా నో చెప్పేశారని టాక్.

జాన్వీ కపూర్ ను తెలుగు తెరకు అయితే విజయ్ లేదా అజిత్ సినిమాల ద్వారా పరిచయం చేయాలనేది బోనీ ఆలోచన అంటున్నారు. కానీ ఈయనకు ఆ ఆలోచన ఉన్నా.. ఆ హీరోలకు ఉండొద్దూ అనేదే పెద్ద పాయింట్. నిజానికి ఇప్పుడు అజిత్ సరసన పరిచయం అయినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఆయన సినిమాల్లో హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అలాగే సౌత్ ఫ్లేవర్ కు తగ్గట్టుగా మంచి డ్యాన్సులు, సాంగ్స్ ఉండవు. కొంత వరకూ విజయ్ బెటర్. కానీ విజయ్ సినిమాలో ఆల్రెడీ హీరోయిన్లు ఫిక్స్ అయ్యారు అనే టాక్ ఉంది. కాకపోతే తన నెక్ట్స్ మూవీలో అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. మరి జాన్వీకి విజయ్ ఓకే చెప్పాలి కదా..?

ఏదేమైనా కోలీవుడ్ నుంచి బాలీవుడ్ మీదుగా హాలీవుడ్ వరకూ ఎదిగిన ధనుష్ ను కాదని కేవలం కోలీవుడ్ కే పరిమితమైన ఈ విజయ్, అజిత్ లు బెటర్ అని బోనీ కపూర్ అనుకోవడం ఏదైతే ఉందో .. అంటూ సెటైర్స్ వేసుకుంటున్నారు కొందరు.

Related Posts