పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రభాస్

రికార్డ్ అనే మాటకు పనికొస్తుందంటే ఏ చిన్న అంశాన్నీ వదలడం లేదు ఫ్యాన్స్. అసలు సినిమా కంటే ఈ కొసరు మేటర్స్ తోనే ఎక్కవ గొడవలు పడుతుంటారు ఫ్యాన్స్. ఈ క్రమంలో టాలీవుడ్ లోనే అతి పెద్ద వార్ కు సెప్టెంబర్ మొదటి వారం వేదిక కాబోతోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్‌ ఓ.జి మూవీ టీజర్ విడుదల కాబోతోంది. సుజిత్ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో పవన్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపించబోతున్నాడు. ఇక ఓజి టీజర్ తమిళ్ నటుడు వీర బేస్ వాయిస్ ఉన్న అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో ఉంటుందట. ఓ రేంజ్ లో ఎలివేషన్స్ ఉంటాయని ఇప్పటి నుంచే ఎలివేట్ చేస్తున్నారు. ఈ టీజర్ చూస్తే ఫ్యాన్స్ పూనకాలు గ్యారెంటీ అంటూ ఊరిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ ఎంట్రీ ఇలా ఏ సినిమాలోనూ ఉండదు అనేలా టీజర్ ను కట్ చేశారట. అంతెందుకు.. అసలు ఇలాంటి టీజర్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లోనే రాలేదు అనేలా ఉండబోతోందని ఓ రేంజ్ లో హైప్ చేస్తున్నారు. టీజర్‌ మామూలుగా ఉంటేనే యూ ట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మరి వాళ్లు చెప్పినట్టుగానే ఉంటే ఇంక చెప్పేదేముందీ.. యూ ట్యూబ్ షేక్ కావడం ఖాయం. అయితే ఈ టీజర్ వచ్చిన నాలుగైదు రోజుల్లోనే మరో సునామీ వస్తోంది. ఆ సునామీ పేరు సలార్.


ప్రభాస్ , ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినప్పుడే ఇండియన్ బాక్సాఫీస్ ఊగిపోవడం ఖాయం అనుకున్నారు. ఇద్దరూ ప్యాన్ఇండియన్ స్టార్స్. ఇద్దరూ అనేక రికార్డులు బద్ధలు కొట్టిన వాళ్లు. అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టినవాళ్లు. అందుకే సలార్ ఖచ్చితంగా కలెక్షన్స్ పరంగా మరో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేస్తుందనే అంచనాలతో ఉన్నారు విశ్లేషకులు. అలాంటి సలార్ ట్రైలర్ వచ్చేది కూడా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే. సో.. ఈ ట్రైలర్ వ్యూస్, లైక్స్, కమెంట్స్ ను ఖచ్చితంగా ఓజితో కంపేర్ చేసి చూస్తారు. ఈ విషయంలో విన్నర్ టీజరా లేక ట్రైలరా అనే లెక్కలు చూస్తూ గొప్పలు పోయేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు ఫ్యాన్స్.

నిజానికి సలార్ ట్రైలర్ పై చాలా హోప్స్ ఉన్నాయి. గతంలో వచ్చిన టీజర్ లో పెద్దగా ఎలివేషన్స్ కనిపించలేదు. పైగా కేజీఎఫ్ లానే ఉందన్నారు. ఆ రిమార్క్ పోవాలంటే ట్రైలర్ నెక్ట్స్ లెవల్లో ఉండాలి. అప్పుడే తెలుగులో ఓజికి పోటీ ఇస్తుంది. లైక్స్ లోనో, కమెంట్స్ లోనో వ్యూస్ లోనో.. ఎవరు అసలైన తోపు అనేది తేల్చేందుకు ఇద్దరు హీరోల అభిమానులూ సిద్ధంగా ఉన్నారు. మరి వీరిలో ఎవరి ఫ్యాన్స్ ది అప్పర్ హ్యాండ్ అవుతుందో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో తెలుస్తుంది.

Related Posts