‘ఓం భీమ్ బుష్’ ట్రైలర్.. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్

టాలీవుడ్ లో ప్రయోగాలు చేసే హీరోల్లో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు. ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండేలా చూసుకుంటాడు. తనదైన విలక్షణమైన మాండలికంతో హాస్యం పంచడంలోనూ శ్రీవిష్ణుది ప్రత్యేకమైన శైలి. ఇక.. శ్రీవిష్ణుకి తోడు మరో ఇద్దరు కామెడీ స్టార్స్ జత చేరితే అదే ‘ఓం భీమ్ బుష్’. ఈ ముగ్గురూ కలిసి ‘నో లాజిక్‌.. ఓన్లీ మ్యాజిక్‌’ అంటూ ‘ఓం భీమ్ బుష్’ మూవీతో ఫుల్ గా ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు.

‘హుషారు’ ఫేమ్ హర్ష కొనుగంటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తుంది. మార్చి 22న విడుదలకు ముస్తాబవుతోన్న ‘ఓం భీమ్ బుష్’ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసింది టీమ్. హీరోలు ముగ్గురూ ఓ ఊరిలోకి ఎంటరవ్వడం.. అక్కడ బ్లాక్ మ్యాజిక్.. ఆ తర్వాత గుప్త నిధుల అన్వేషణ ఇలా కథ రకారకాలుగా ముందుగా సాగుతోంది. ఫైనల్ గా ఎంటర్ టైన్ మెంటే పరమావధిగా ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది.

మరోవైపు ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తున్న ‘ఓం భీమ్ బుష్’ టీమ్..
రేపటి (మార్చి 16) నుంచి వైజాగ్ లో వీర విహార యాత్ర చేయబోతుంది. సింహాచలం టెంపుల్, గాజువాక, గీతమ్ కాలేజ్, బీచ్ రోడ్ లలో సందడి చేయనుంది టీమ్

Related Posts