విశాల్ ‘రత్నం’ కోసం దేవిశ్రీ పాడిన పాట

యాక్షన్ స్టార్ విశాల్ నటిస్తున్న ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రత్నం’. గతంలో విశాల్ తో ‘తామరభరణి, పూజై’ వంటి సినిమాలను తెరకెక్కించిన హరి డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా ఇది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

లేటెస్ట్ గా ‘రత్నం’ మూవీ నుంచి ‘డోన్ట్ వర్రీ డోన్ట్ వర్రీ రా చిచ్చా.. ఇంతకన్నా ఇత్తడయ్యే కష్టాలు చూసొచ్చా’ అంటూ శ్రీమణి రాయగా.. దేవిశ్రీప్రసాద్ పాడిన పాట విడుదలైంది. సందేశాత్మకంగా సాగే ఈ మాస్ సాంగ్ లో విశాల్, యోగిబాబు సందడి చేస్తున్నారు. ఈ మూవీలో విశాల్ కి జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది. ఏప్రిల్ 26న తెలుగు, తమిళ భాషల్లో ‘రత్నం’ విడుదలకు ముస్తాబవుతోంది

Related Posts