ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేసిన నాగచైతన్య

‘ధూత‘ వెబ్ సిరీస్ తో నాగచైతన్య డిజిటల్ వరల్డ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. ఈనేపథ్యంలో ‘ధూత‘ ప్రమోషన్స్ లో ఫుల్ స్పీడు పెంచాడు. ఈ సిరీస్ కోసం విభిన్నంగా ప్రచార కార్యక్రమాలలో సందడి చేస్తున్నాడు. అయితే.. ఇప్పటివరకూ ఫ్యాన్స్.. స్టార్స్ ని చూడడానికి వస్తుంటారు. ఈసారి తానే ఫ్యాన్స్ దగ్గరకు వెళ్లానంటున్నాడు చైతన్య. ఫ్యాన్స్ తో కలిసి ‘ధూత‘ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలను ముచ్చటించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

గతంలో ‘13 బి‘ వంటి సూపర్ హిట్ థ్రిల్లర్ అందించిన విక్రమ్ కుమార్.. ‘ధూత‘ సిరీస్ ను ఎన్నో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దాడట. ఈ సిరీస్ లో పార్వతి తిరువోత్తు, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ వంటి ఫీమేల్ యాక్టర్స్ ఇతర కీ రోల్స్ లో కనిపించబోతున్నారు. నాగచైతన్య బర్త్ డే స్పెషల్ గా నవంబర్ 23న ‘ధూత‘ ట్రైలర్ రిలీజవుతోంది. ఫ్యాన్స్ కోసం చైతన్య ఇస్తోన్న గిఫ్ట్ ఇది.

Related Posts