ఈవారం బాక్సాఫీస్ వద్ద సినిమాల జోరు

వారం వారం కొత్త సినిమాల జోరు మామూలుగా లేదు. ఒకవైపు థియేటర్స్, మరోవైపు ఓటీటీలో నయా మూవీస్ సందడి చేస్తూనే ఉన్నాయి. ఇక.. ఈ వారం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల మధ్య పెద్ద కాంపిటేషన్ ఉండబోతుంది. ముఖ్యంగా మెగా కాంపౌండ్ కి చెందిన రెండు సినిమాలు ఈ వారం బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయబోతున్నాయి.

ఈ వారం విడుదలవుతోన్న చిత్రాలలో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఆదికేశవ‘ ఒకటి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 24న) థియేటర్లలోకి వస్తుంది. వైష్ణవ్ కి జోడీగా శ్రీలీల నటించింది. ఇప్పటికే విడుదలైన పాటల్లో వీరిద్దరి పెయిర్ కి, డ్యాన్సులకు మంచి పేరొచ్చింది. ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. అయితే.. ఈ మూవీ ప్రచారంలో ఎక్కడా జి.వి. కనిపించడం లేదు. ఇక.. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ గా ‘ఆదికేశవ‘ రాబోతుంది. వైష్ణవ్, శ్రీలీల ఇమేజ్ కి తోడు.. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నుంచి రాబోతుండడంతో ‘ఆదికేశవ‘పై మంచి అంచనాలున్నాయి.

ఈ వారం మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఆదికేశవ‘తో పాటు.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించిన ‘కోట బొమ్మాళి పీఎస్‘ ఆడియన్స్ ముందుకు వస్తుంది. మలయాళంలో హిట్టైన ‘నాయట్టు‘ రీమేక్ గా ‘కోట బొమ్మాళి పీఎస్‘ సినిమా రూపొందింది. ఎప్పుడైతే ఈ చిత్రం నుంచి ‘లింగి లింగి లింగిడి‘ సాంగ్ రిలీజయ్యిందో.. అప్పట్నుంచే ‘కోట బొమ్మాళి పీఎస్‘పై అటెన్షన్ పెరిగింది. శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ టీజర్, ట్రైలర్స్ కూడా చాలా ఇంప్రెస్సివ్ గా అనిపించాయి.

ఈ శుక్రవారం విడుదలకు ముస్తాబైన మరో చిత్రం ‘సౌండ్ పార్టీ‘. ‘బిగ్ బాస్‘ ఫేమ్ వీజే స‌న్నీ హీరోగా నటించిన చిత్రమిది. సన్నీకి జోడీగా హ్రితిక శ్రీనివాస్ నటించింది. శివన్నారాయణ, ఆలీ, సప్తగిరి, పృథ్వీరాజ్, చలాకీ చంటి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సంజ‌య్ శేరి దర్శకత్వంలో రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్ టైనర్ గా ‘సౌండ్ పార్టీ‘ రాబోతుంది.

తమిళం నుంచి అనువాద రూపంలో ఈవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ధ్రువ నక్షత్రం’. 2016 లోనే చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం 2018 లో విడుదలవ్వాల్సి ఉంది. అయితే.. ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా విడుదలకు ఇంతకాలం పట్టింది. వెర్సటైల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించాడు. టెర్రరిజమ్ ను అరికట్టడానికి.. చట్టానికి కట్టుబడకుండా.. గవర్న్ మెంట్ ప్రొసీజర్స్ ఏమాత్రం ఫాలో అవ్వకుండా ఫామ్ అయిన ‘ది బేస్ మెంట్‘ అనే 11 మంది సభ్యుల గల టీమ్ ఎలా పనిచేసింది‘ అనే కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. అయితే.. ఈ సినిమాని ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టిన కారణంగా అనుకున్న సమయానికి విడుదలతోందా? లేదా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

Related Posts