న్యూ లుక్ లో మెరిసిపోతున్న నాగచైతన్య

అక్కినేని నవ యువ సామ్రాట్ నాగచైతన్య ఇప్పుడు న్యూ మేకోవర్ తో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటివరకూ మేకోవర్స్ పరంగా పెద్దగా దృష్టి సారించని చైతన్య.. అప్ కమింగ్ మూవీ కోసం మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గా రెడీ అవుతున్నాడు.

తాజాగా సంతోష్ శోభన్ సినిమా ఓపెనింగ్ కి విచ్చేసిన నాగచైతన్య లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో దర్శనమిచ్చాడు. వైట్ షర్ట్ లో నల్లని జుట్టు, గడ్డంతో మెరిసిపోతున్న చైతన్య పిక్స్ ఇప్పుడు సినీ ప్రియులందరి అటెన్షన్ ను ఆకర్షిస్తున్నాయి.

నాగచైతన్య న్యూ మేకోవర్ తన 23వ చిత్రం కోసమే. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం మత్స్య కారుల జీవితాలను ఆవిష్కరించనుందట. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగాతెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం ఆమధ్య శ్రీకాకుళంలో పర్యటించారు హీరో నాగచైతన్య, డైరెక్టర్ చందూ మొండేటి.

ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘ప్రేమమ్, సవ్యసాచి‘ వంటి సినిమాలొచ్చాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లబోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో చైతన్య, చందూ మొండేటి సినిమా రూపొందుతోంది.

Related Posts