‘స్వయంభూ’ ప్రపంచంలోకి ఎంటరైన నభా నటేష్!

‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్.. అంతకుమించి అన్నట్టుగా ‘స్వయంభు’ చిత్రంతో రెడీ అవుతున్నాడు. పీరియడ్ యాక్షన్ డ్రామాగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. భువన్, శ్రీకర్ సంయుక్త నిర్మాణంలో టాగూర్ మధు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ మ్యూజిక్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ టెక్నికల్ గా ప్లస్ కానున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో నిఖిల్ కి జోడీగా సంయుక్త మీనన్ ఎంపికయ్యింది. ఇప్పుడు మరో కీలకమైన పాత్రకోసం నభా నటేష్ ను తీసుకున్నారు.

మాతృ భాష కన్నడలో మూడు సినిమాలు చేసిన తర్వాత.. సుధీర్ బాబు సరసన ‘నన్ను దోచుకుందువటే’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది నభా నటేష్. తొలి సినిమా అంతగా ఆడకపోయినా.. పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ ఈ కన్నడ కస్తూరికి భారీ విజయాన్ని అందించింది. ఈ మూవీలో రామ్ సరసన తన అందాలను ఆరబోసి కుర్రకారును కైపెక్కించింది ఈ ‘ఇస్మార్ట్’ బ్యూటీ.

‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత ‘డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మాస్ట్రో’ అంటూ వరుస సినిమాలు చేసిన నభా నటేష్.. మూడేళ్లుగా సినిమాలకు దూరమైంది. అసలు ఇకపై నభా నటిస్తోందా? లేదా? అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇప్పుడు ‘స్వయంభూ’తో మళ్లీ సిల్వర్ స్క్రీన్ కి రీఎంట్రీ ఇస్తూ.. అందరినీ ఆశ్చర్యపరిచింది నభా. ‘స్వయంభూ’ ప్రపంచంలోకి నభా నటేష్ కి స్వాగతం అంటూ ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.

Related Posts