ఈ వారం బాక్సాఫీస్ వద్ద సినిమాల సందడి

వారం వారం బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ఇక.. ఈవారం థియేటర్లలోకి వస్తోన్న సినిమాల సంగతి విషయానికొస్తే ముందుగా చెప్పుకోవాల్సింది విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’. సూపర్ డూపర్ హిట్ ‘గీత గోవిందం’ తరహాలోనే ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కించాడు. చిన్న సినిమాగా విడుదలైన ‘గీత గోవిందం’ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూళ్లు సాధించింది. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’తో బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్లు వసూళ్లను కొల్లగొడతాననే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.

విజయ్ దేవరకొండ – పరశురామ్ ‘గీత గోవిందం’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ నిర్మిస్తే.. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ కోసం మరో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రంగంలోకి దిగాడు. ఈసారి విజయ్ కి జోడీగా లక్కీ బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటించింది. గోపీ సుందర్ స్వరకల్పన చేసిన ఈ చిత్రం పాటలకు మంచి స్పందన వస్తోంది. మొత్తంమీద.. ఈ వారం హాట్ ఫేవరెట్ గా థియేటర్లలోకి దిగుతోంది ‘ఫ్యామిలీ స్టార్’.

తెలుగు నుంచి ‘ఫ్యామిలీ స్టార్’తో పాటు థియేటర్లలోకి వస్తోన్న మరో చిత్రం ‘భరతనాట్యం’. సూర్య తేజ ఏలే హీరోగా ప‌రిచ‌యం అవుతున్న చిత్రం ‘భరతనాట్యం’. ఈ సినిమాలో మీనాక్షి గోస్వామి కథానాయిక నటించింది. ‘దొరసాని’ ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వం వహించారు. పి.ఆర్ ఫిలింస్ బ్యానర్ పై పాయల్ సరాఫ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దర్శకుడు కావాలని ప్రయయత్నించే ఓ కుర్రాడు.. ఆర్థిక, ఫ్యామిలీ, లవ్ లైఫ్ నుంచి సమస్యలు ఎదుర్కుంటూ అనుకోకుండా క్రైమ్ వరల్డ్ లో పడి అక్కడి నుంచి ఎలా బయటపడ్డాడనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.

ఈ వారం చిత్రాలలో ‘బహుముఖం’ ఒకటి. హర్షివ్ కార్తీక్ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన చిత్రం ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్ అండ్ ది యాక్టర్’ అనేది ట్యాగ్‌లైన్‌. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ని క్రియేట్ చేశాయి.

తెలుగు సినిమాలతో పాటు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అనువాద చిత్రాలలో ‘మంజుమ్మల్ బాయ్స్’ ఒకటి. ఒకప్పుడు ఎక్కువగా తమిళం నుంచి తెలుగులోకి అనువాదాలు వచ్చేవి. అయితే.. ఇప్పుడు మలయాళం నుంచి కూడా వరుసగా డబ్బింగ్ మూవీస్ టాలీవుడ్ కి క్యూ కడుతున్నాయి. ‘ప్రేమలు’ వంటి సూపర్ హిట్ తర్వాత తెలుగులోకి వస్తోన్న మరో మలయాళం మూవీ ‘మంజుమ్మల్ బాయ్స్’. ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో విడుదల చేస్తుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ‘మంజుమ్మల్ బాయ్స్’పై మంచి బజ్ ఏర్పడింది.

Related Posts