మిస్ అండ్ మిస్టర్ శెట్టి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత

అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి జంటగా నటించిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈచిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. రిలీజ్ కు ముందునుంచి కంప్లీట్ పాజిటివ్ బజ్ ఉందీ సినిమాపై టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచారు. కాకపోతే విడుదలకు సంబంధించి ఎక్కువ సార్లు పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ కారణంగా కొంత బజ్ తగ్గింది. అయినా ఓపెనింగ్స్ బాగా వస్తాయనే భావించారు మేకర్స్. బట్ మిస్ శెట్టి మిస్టర్ శెట్టితో పాటు తుఫాన్ లాంటి జవాన్ కూడా ఉండటంతో ఓపెనింగ్స్ పై ప్రభావం పడింది. పైగా ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వచ్చింది. జవాన్ కు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.


ఒక బ్లాక్ బస్టర్ ముందు నిలవడం అంటే చిన్న విషయం కాదు. అయినా ఈ మూవీ కొంత వరకూ బానే పర్ఫార్మ్ చేసింది. అయితే ఓపెనింగ్స్ పరంగా అంచనాలను అందుకోలేదు అనేది నిజం. దీనికి తోడు ప్రమోషన్స్ లో అనుష్క కనిపించకపోవడం.. నవీన్ ఒక్కడి వల్ల కాకపోవడం వల్ల కూడా ఆ ప్రభావం ఓపెనింగ్స్ పై కనిపించింది. దీంతో ఈ మూవీ ఫస్ట్ డే కేవలం 4కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేయగలిగింది. ఓ రకంగా ఇవి దారుణమైన కలెక్షన్స్ అనే చెప్పాలి. అనుష్క లాంటి హీరోయిన్ ఉన్నా.. ఆ ప్రభావం కనిపించలేదు అంటే ఇది ఖచ్చితంగా కంటెంట్ లోపమే. ఇంకా చెబితే ఈ సినిమాకు మైనస్సే అనుష్క అనేవారూ ఉన్నారు.


ఏదేమైనా ఇవాళా రేపు సినిమాకు ప్రమోషన్స్ ఎంత అవసరమో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మరోసారి ప్రూవ్ చేసింది. అటు జవాన్ కలెక్షన్స్ పరంగా తుఫాన్ లా దూసుకుపోతోంది. దీంతో ఇక ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్స్ వస్తాయి అని చెప్పలేం. వచ్చినా.. సూపర్ హిట్ అనే టాక్ వరకూ వెళ్లడం కష్టమే అనేది విశ్లేషకుల అంచనా.

Related Posts