వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ వెకేషన్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. గతేడాది వచ్చిన గని డిజాస్టర్ అయింది. కాస్త గ్యాప్ తీసుకుని ప్రవీణ్ సత్తారు నమ్ముతూ చేసిన గాండీవధారి అర్జున కూడా డిజాస్టర్ అనిపించుకుంది. ఈ మూవీపై అతను చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ మొదటి ఆటకే టపా కట్టేసింది. ఈ సినిమా కంటెంట్ విషయంలోనే పూర్తిగా ఫెయిల్ అయ్యాడు ప్రవీణ్ సత్తారు.

ఇక మరోవైపు ఈ యేడాది తన పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాడు వరుణ్. హీరోయిన్ లావణ్య త్రిపాఠిని నవంబర్ లో పెళ్లి చేసుకోబోతున్నాడు. వీళ్లిద్దరూ ప్రేమించుకున్నారన్న విషయం వాళ్లు చెప్పేవరకూ ఎవరికీ తెలియదు. అంతా సడెన్ గా అనౌన్స్ చేశారు. ఆ వెంటనే ఎంగేజ్మెంట్ కూడా అయింది.


ఈ లోగా ఓ ప్రీ వెడ్డింగ్ వెకేషన్ కు ప్లాన్ చేసుకున్నాడు వరుణ్ తేజ్. మామూలుగా ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఉంటాయి. బట్.. ఇతను మాత్రం మూడు ముళ్లు వేయడానికి ముందే పేరెంట్స్, చెల్లి నిహారికతో కలిసి వెకేషన్ లో ఉన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెళ్లి తర్వాత హనీమూన్ కు వెళతారు. దానికి ముందే ఫ్యామిలీతో కలిసి వెళ్లడం మంచిదే.

పైగా నిహారిక లైఫ్ లో డిస్ట్రబ్ అయ్యింది. తనకూ కాస్త ఉపశమనంగా ఉంటుందనుకున్నారేమో.. మొత్తంగా కుటుంబమంతా విహారయాత్రలో ఉన్నారిప్పుడు.

Related Posts