షారుఖ్ ను సినిమా దేవుడు అన్న కంగనా రనౌత్

ఎప్పుడూ కాంట్రవర్శీలేనా కాసింత ప్రేమవర్శీలు కూడా ఉండాలనుకుందో ఏమో.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. షారుఖ్ ఖాన్ ప్రశంసల వర్షం కురిపించింది. జవాన్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సందర్భంగా తనలోని ఫ్యాన్ ను కూడా బయటకు తీసుకువచ్చిన ఏకంగా అతన్ని సినిమా దేవుడుగా అభివర్ణించడం విశేషం. నిజానికి బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ఎలాంటి అండా లేకుండా ఎదిగాడు. స్వయంకృషితోనే బాక్సాఫీస్ బాద్ షా అనిపించుకున్నాడు. ఆ కారణంగానే(అంటే నెపోటిజంతో రాలేదు కదా) కంగనాకు షారుఖ్ అంటే అభిమానం. ఇక ఈ సినిమా రిజల్ట్ తెలిసిన వెంటనే తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పేద్ద పోస్ట్ పెట్టింది కంగనా. ఈ పోస్ట్ చూస్తే ఆమెకు షారుఖ్ అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. అదే టైమ్ లో కొందరు విమర్శకులకూ చురకలు అంటించింది. తన పోస్ట్ లో ఏముందంటే..


” 90లలో లవర్ బాయ్ గా ఉండి, తన 40-50 ఇయర్స్ మధ్యలో ఉన్న ఫ్యాన్స్ తో పాటు వారికి ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ను మళ్లీ ఇన్నాళ్లకు తిరిగి ఇచ్చాడు. ఈ విజయంతో ఆయన మళ్లీ తనను తాను ఆవిష్కించుకున్నాడు. ఇండియన్ మాస్ హీరోగా ఎదగడం కంటే నిజ జీవితంలో హీరోయిక్ విషయం ఏముంటుందీ..? కొన్నేళ్లుగా కొంతమంది ఆయన ఎంచుకుంటున్న కథలను ఎంత ఎగతాళి చేశారో నాకు ఇంకా గుర్తుంది. సుదీర్ఘ కాలం కెరీర్ లను ఆస్వాదించే కళాకారులందరికీ ఇది ఓ మాస్టర్ క్లాస్. ప్రతి ఒక్కరూ తమను తాము మళ్లీ ఎలా ఆవిష్కరించుకోవాలో చెప్పిన పాఠం లాంటిది. ఇది కేవలం ఎస్ఆర్కే చొట్టబుగ్గలు, కౌగిలింతలతోనే కాదు.. ఒక గొప్ప ప్రపంచాన్ని సృష్టించాలి. షారుఖ్ ఖాన్ సినిమా దేవుడు. మీ పట్టుదల, కృషి, వినయం చూసి కింగ్ ఖాన్ కు శిరసు వంచి నమస్కరిస్తున్నాను.. “


ఇదీ కంగనా రనౌత్ పెట్టిన పోస్ట్. ఎప్పుడూ బాలీవుడ్ లో హీరోలను, హీరోయిన్లను తిడుతూనే ఎక్కువగా పోస్ట్ లు పెట్టే కంగనా రనౌత్ ఇలా షారుఖ్ పై తన ప్రేమను ఓ రేంజ్ లో కుమ్మరించడంతో నెటిజన్స్ కూడా సర్ప్రైజ్ అవుతున్నారు.


ఇక జవాన్ బాలీవుడ్ నుంచి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది. ఫస్ట్ డే సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తే జవాన్ నాన్ బాహుబలి రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు విశ్లేషకులు.

Related Posts