‘భోళాశంకర్’ నిర్మాతకు మెగాస్టార్ భరోసా

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ‘భోళా శంకర్’ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. చిరు రీఎంట్రీలో ఘోరంగా దెబ్బతిన్న చిత్రమిదే. దీంతో.. ‘భోళా శంకర్’ నిర్మాత అనిల్ సుంకరకు మరో సినిమాని చేస్తానని మాటిచ్చాడట మెగాస్టార్. ఇప్పుడా మాటను నిలబెట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్. ప్రస్తుతం చిరంజీవి వరుసగా యువ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఈకోవలోనే.. ‘ఊరు పేరు భైరవకోన’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ తోనూ ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఈవారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాకి నిర్మాత అనిల్ సుంకర. దీంతో.. ఇదే దర్శకుడు చెప్పిన ఓ స్టోరీ ఐడియా అనిల్ సుంకరకు బాగా నచ్చిందట. త్వరలోనే చిరంజీవికి ఆ కథను చెప్పించబోతున్నాడట. వి.ఐ.ఆనంద్ పేరుకు తమిళవాడే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేశాడు. డిఫరెంట్ జానర్స్, స్టోరీస్ తో సినిమాలు చేయడంలో వి.ఐ.ఆనంద్ తన ప్రత్యేకతను చాటుకుంటుంటాడు. పైగా.. చిరంజీవి నటించిన ‘స్టాలిన్’ సినిమాకి మురుగదాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గానూ పనిచేశాడు. మరి.. మెగాస్టార్ ని తన స్టోరీతో వి.ఐ.ఆనంద్ మెప్పిస్తాడా? త్వరలోనే ‘భోళాశంకర్’ నిర్మాతకు చిరు మరో ఆఫర్ ఇస్తాడా? కాలమే నిర్ణయించాలి

Related Posts