ధనరాజ్ డైరెక్టోరియల్ ‘రామం రాఘవం’ గ్లిమ్స్

కమెయడిన్ ధనరాజ్ డైరెక్టర్ గానూ సత్తా చాటడానికి సిద్ధమయ్యాడు. ధనరాజ్ దర్శకత్వం వహిస్తూ నటిస్తోన్న చిత్రం ‘రామం రాఘవం’. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో కొడుకుగా ధనరాజ్ నటిస్తుంటే.. తండ్రి పాత్రలో మరో విలక్షణ నటుడు సముద్రఖని కనిపించబోతున్నాడు.

వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేసింది టీమ్. ఈ గ్లిమ్స్ ను ఎనర్జిటిక్ స్టార్ రామ్ ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేశారు. తండ్రీకొడుకుల పాత్రల్లో ధనరాజ్, సముద్రఖని బాండింగ్ తెలిపేలా ఉన్న సన్నివేశాలతో ఈ గ్లిమ్స్ ఆకట్టుకుంటోంది.

పృథ్వి పొలవరపు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ ద్విభాష చిత్రానికి ‘విమానం’ దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథను సమకూరుస్తుండడం విశేషం. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య, పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు.. అమలా పురం, రాజమండ్రి, రాజోలు, చెన్నై పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది

Related Posts