ఈ తరపు నట శిఖరం..నవరస నటనకు పెట్టని కోట.. కోట శ్రీనివాసరావు బర్త్ డే స్పెషల్

పాత్ర పాతదే అయినా… దాన్ని కొత్తగా ప్రజంట్ చేయడానికి తాపత్రయపడే నటుడు కోట శ్రీనివాసరావు. ఏడొందల పైచీలుకు సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేసి మెప్పించిన ఘనత ఆయనది. అంతకుముందు రంగస్థలం మీద సుదీర్ఘానుభవం ఉండడంతో ఎలాంటి సిట్యుయేషన్ లో అయినా దూసుకెళ్లిపోయేవారు. క్రూయల్ విలనీ..కామెడీ విలనీ…కారక్టర్ రోల్స్ ఇలా…ఇచ్చిన పాత్రకు నూటయాభై శాతం న్యాయం చేయగల మనకాలపు గ్రేట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన కొన్ని జ్ఞపకాలను మన తెలుగు 70ఎమ్ఎమ్ లో పంచుకుందాం..


కోట శ్రీనివాసరావు తెలుగు సినిమాకు దొరికిన ఆణిముత్యం అంటే అతిశయోక్తి కాదు. కోటకు ముందు ఇన్ని వేరియేషన్స్ చూపించిన ఎందరో నటులున్నారు. కానీ ఆ తర్వాత లేరు అనడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఉన్నా వాళ్లు వేరే భాషకు చెందిన వాళ్లు మాత్రమే.. క్రూరమైన విలన్ గా ఎంత భయపెడతాడో.. అత్యంత పిసినారిగా అంతే నవ్విస్తాడు. ఓ మాస్ డైరెక్టర్ క్యారెక్టర్ లో ఎంత మౌల్డ్ అవుతాడో.. ఓ క్లాస్ డైరెక్టర్ చేత అంత క్లాప్స్ కొట్టిస్తాడు. అదే టైమ్ లో హాస్య దర్శకులకు సైతం ఆయన ఓ బెస్ట్ ఆప్షన్..


కంకిపాడు ఓ స్మాల్ విలేజ్ ఇన్ క్రిష్ణా డిస్ట్రిక్ట్. కార్ట్స్ ప్రింటెడ్.. మేటర్ సేమ్.. బట్ నేమ్స్ ఛేంజ్ .. ఈ మాటలు వినగానే ఠక్కున గుర్తొచ్చే పేరు కోట శ్రీనివాసరావు. కోట శ్రీనివాసరావులోని టాలెంట్ ను కొత్తగా గుర్తించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కోటలో ఉన్న ఈజ్ ను…టైమింగ్ ను అద్భుతంగా వాడుకున్నాడు వర్మ. మనీ మూవీలో కోట చేసిన అల్లరి అంతా ఇంతా కాదు.


కంకిపాడు డాక్టరుగారబ్బాయి కోట శ్రీనివాసరావు. డాక్టరవుదామనుకున్నాడు. కష్టమని తెలుసుకుని గ్రాడ్యుయేటై..ఆనక బ్యాంకు ఎంప్లాయిగా స్తిరపడ్డాడు. కానీ లోపల తపనతో డ్రామాల్లో నటిస్తూ.. అట్నుంచి సినిమాల్లోకి వచ్చేశారు. వెంకటేశ్ గణేష్ మూవీలో తన చరిత్ర తానే చెప్పుకునే సీన్ లో కోట నటన అసామాన్యం. ఈ పాత్రతో ఓ కొత్త తరహా విలనీని తెలుగు తెరకు పరిచయం చేశారు కోట.

The President, Shri Pranab Mukherjee presenting the Padma Shri Award to Shri Kota Srinivasa Rao, at a Civil Investiture Ceremony, at Rashtrapati Bhavan, in New Delhi on April 08, 2015.

పాత్ర ఏదైనా గెటప్ తో సహా అందులోకి పరకాయప్రవేశం చేసి సదరు కారక్టర్ లా బిహేవ్ చేసేస్తారు కోట. అందుకే కొన్ని సినిమాలు కోట శ్రీనివాసరావు మీదే సక్సెస్ కొట్టేస్తాయి. విలనీలో ఆ మూల నుంచి ఈ మూల వరకు మొత్తం ఇరగదీసేశాడు. అసలు కారక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన సత్తా ఏంటో.. లోకి దూరితే సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో అహనాపెళ్లంట చూస్తే అర్ధమౌతుంది.


కోట శ్రీనివాసరావు, బాబూమోహన్ జోడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య తర్వాత ఆ స్థాయి జంటగా వీరికి పేరొచ్చింది. మళ్లీ అలాంటి జంటను తెలుగు తెర చూడలేదు కూడా. ఇద్దరూ కలిసి తెలుగు ప్రేక్షకులకు పంచిన హాస్యం.. అందించిన ఎంటర్టైన్మెంట్ అంత త్వరగా మర్చిపోయేది కాదు.


గబ్బర్ సింగ్ మూవీ వచ్చే వరకు కోట జస్ట్ డైలాగులే ఇరగదీస్తాడనుకున్నారు జనం. కానీ సింగర్ గా కూడా తక్కువోడు కాదని ప్రూవ్ చేసుకున్నాడు. మందుబాబులం మేము మందుబాబులం అంటూ కోట పాడిన పాటకు టోటల్ స్టేటంతా ఫిదా అయ్యింది. స్టేజ్ నటుల కెపాసిటీ ఏమిటో ప్రపంచానికి మరోసారి చాటిన అరుదైన నటుడు కోట. విలనీయే కాదు.. కామెడీ చేయడంలోనూ కోట పవర్ ఫుల్లే. తను తొణక్కుండా కూల్ గా డైలాగ్స్ పేల్చి ఆడియన్స్ ను అవాక్కయ్యేలా చేస్తాడు కోట. బావగారూ బావున్నారా మూవీలో శ్రీహరి తండ్రిగా కోట నటన మామూలుగా ఉండదు. శ్రీహరి దెబ్బతిన్నప్పుడల్లా కోట ఓదార్పు డైలాగు ఆడియన్స్ కు పొట్ట చెక్కలు చేసేస్తుంది.


తను చేస్తున్న పాత్రను డైరక్టర్ ఎలా ఊహిస్తున్నాడో ముందు ఆకళింపు చేసుకుంటాడు కోట శ్రీనివాసరావు. ఇక ఆ తర్వాత చెలరేగిపోతాడు. ముఖ్యంగా ఎమోషన్స్ కు అవకాశం ఉన్న పాత్రే అయితే ఇక చెప్పనవసరం లేదు. అలాంటి ఛాన్స్ వస్తే తన నటనతో ఆడియన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. ఒక్క హీరో పాత్ర తప్ప అన్ని రకాల పాత్రలూ చేసి మెప్పించారు కోట శ్రీనవాసరావు. టిపికల్ మేనరిజంతో ఒక పాత్రను ప్రవేశపెట్టాలంటే.. దర్శకులకున్న ఏకైక ధైర్యం మన దగ్గర కోట శ్రీనివాసరావు ఉన్నాడనే. ఆ ధైర్యమే మనకు కోట శ్రీనివాసరావు వంటి గ్రేట్ యాక్టర్ ను అందించింది.


అదే సమయంలో సెంటిమెంట్ పండించాల్సిన పాత్రల్లో ఆడియన్స్ కళ్లు చెమర్చేలా నటించగలడు కోట. ఆ మధ్య వచ్చిన ఎన్టీఆర్ బృందావనంలో ఇద్దరు కొడుకులకూ బుద్ది చెప్పే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఒక వైపు కొడుకులు చేస్తున్న తప్పును ఎత్తి చూపిస్తూ…తమ కుటుంబం కోసం పట్నం నుంచి వచ్చిన కుర్రాడు చేస్తున్న త్యాగం గురించి వివరిస్తూ…అద్భుతంగా జీవిస్తారు కోట శ్రీనివాసరావు.


నాగభూషణం…రావుగోపాల్రావు…నూతన్ ప్రసాద్ ఇదీ వరస. అంతకు ముందు సిఎస్ఆర్… డైలాగులతోనే ఆడుకున్న నటులు వీళ్లు. ఈ టీమ్ లో తర్వతి జనరేషన్ లో కోట శ్రీనివాసరావు పేరే చెప్పాలి. బాపు రాంబంటు మూవీలో విశ్వరూపం చూపించే సన్నివేశంలో కోట అదరగొట్టేస్తాడు. నటుడుగా కోటది ఎవరూ అందుకోలేని ఎత్తు. గుండెల్ని పిండేసే కష్టాలెదురైనప్పుడూ.. నిలబడనీయని సంతోషం ముంచెత్తినప్పుడూ కూడా ఒకేలా ఉండగల వ్యక్తి కోట శ్రీనివాసరావు.

రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యే అయినా…కోటకి సినిమాయే ప్రాణం. అమితాబ్ ను సైతం మెప్పించిన నటుడాయన. ఈ తరంలో డైలాగ్ పవర్ తో ఆడియన్స్ అటెన్షన్ తన వైపు తిప్పుకోగలిగిన సత్తా ఉన్న ఏకైకనటుడు కోట. సింపుల్ గా చెబితే నటుడుగా ఆయనో శిఖరం.


మనకాలపు గ్రేట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు గారు మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని…ఇంకెన్నో పాత్రల్లో మెప్పించాలని…కోరుకుంటూ తెలుగు 70ఎమ్ఎమ్ తరఫున వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

            - బాబురావు. కామళ్ల

Related Posts