బేబీకి ఊహించని అడ్వాంటేజ్

చిన్న సినిమాలు ఈ మధ్య సరిగా పర్ఫార్మ్ చేయడం లేదు అనేది నిజం. రీసెంట్ గా వచ్చిన సామజవరగమనా తప్ప హిట్ అనే మాటే వినిపించడం లేదు. అటు పెద్ద సినిమాలేవీ లైన్ లో లేకపోవడంతో ఓ రకంగా టాలీవుడ్ లో ఓ నిస్తేజం ఏర్పడింది.

ప్రతి వారం చాలా సినిమాలు విడుదలవుతున్నాయి. బట్ ఏదీ గుడ్ న్యూస్ చెప్పలేకపోతుఉన్నాయి. ఈ శుక్రవారం వచ్చిన సినిమాల్లో రిలీజ్ కు ముందు మంచి బజ్ ఉంది. బట్ వాటిని నిలబెట్టుకోవడంలో అవి ఫెయిల్ అయ్యాయి. ఇక నెక్ట్స్ వీక్ వచ్చే సినిమాలపై ఏమంత ఆసక్తి లేదు అనుకుంటోన్న టైమ్ లో సడెన్ గా లైమ్ లైట్ లోకి వచ్చింది బేబీ మూవీ. సాయి రాజేష్‌ డైరెక్షన్ లో ఎస్కేఎన్ నిర్మించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అంతకు ముందు ఈ మూవీ సాంగ్స్ అన్నీ టాప్ లైన్ లో ఉన్నాయి. టీజర్ కూడా ఓ మోస్తరుగా ఆకట్టుకుంది. బట్ ట్రైలర్ తర్వాత సీన్ మారిపోయింది. ఎవరూ ఊహించని ట్రైలర్ ఇది.

ఓ రేంజ్ లో ఉందనే అప్లాజ్ వచ్చింది. తొలి ప్రేమ తాలూకూ జ్ఞాపకాలను తట్టి లేపుతూనే.. దాని వైఫల్యాన్నీ మరోసారి గుర్తు చేసేలా కనిపిస్తోందీ మూవీ. అందుకు తగ్గట్టుగా ప్రేమ రంగులు మార్చుకుంటుంది. అనే అర్థం వచ్చేలా హీరోయిన్ పాత్రలో రెండు కోణాలున్నాయి. ట్రైలర్ తో ఈ మూవీపై అంచనాలు మొదలయ్యాయి. ఆ అంచనాలను అందుకునేందుకు వచ్చే వారం మరో ప్లస్ పాయింట్ కూడా యాడ్ అయింది.
బేబీ జూలై 14న విడుదల కాబోతోంది. అదే రోజు తమిళ్ స్టార్ శివకార్తికేయన్ నటించిన మహా వీరుడు వస్తోంది. ఈ మూవీపై ఎలాంటి అంచనాలూ లేవు. శివకార్తికేయన్ కు ఇక్కడ పెద్ద ఫ్యాన్ బేస్ కూడా లేదు. దీంతో పాటు మరో తమిళ్ డబ్బింగ్ మూవీగా నాయకుడు వస్తోంది.

ఈ సినిమాపై అసలు బజ్ లేదు. ఇలా బేబీకి పోటీ కూడా లేకుండా కలిసొచ్చింది. కాకపోతే జూలై 12న టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ లోని మరో సిరీస్ వస్తోంది. ఈ మూవీపైనా ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా బజ్ లేదు. మొత్తంగా బేబీకి ట్రైలర్ తర్వాత ఓ హై మూమెంట్ వస్తే.. విడుదల టైమ్ కు పోటీ లేకుండా ఓ పెద్ద అడ్వాంటేజ్ యాడ్ అయింది. మరి ఈ అడ్వాంటేజ్ ను బేబీ ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.

Related Posts