ఎన్టీఆర్ హీరోయిన్ కు ఇంకా టైమ్ ఉంది

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాను చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకున్నాడని ఇప్పటికే చాలామందికి అర్థమైంది. ఈ సినిమా టైమ్ లో ఎన్నో ఇంపార్టెంట్ ఇష్యూస్ జరిగినా పట్టించుకోలేదు. స్పందించలేదు. అంతా ఫోకస్డ్ గా దేవరపై కాన్ సెంట్రేట్ చేశాడు యంగ్ టైగర్. కొరటాల శివ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రంతో మరోసారి ప్యాన్ ఇండియన్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన అప్లాజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లి సోలోగా మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నాడు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ కు సంబంధించి ప్రస్తుతం వరుసగా యాక్షన్ పార్ట్స్ నే చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఏకంగా ఏడు భారీ ఫైట్స్ ఉంటాయని ఎప్పటి నుంచో వినిపిస్తోంది. వీటిలో అండర్ వాటర్ యాక్షన్ సీన్ ఇప్పటి వరకూ తెలుగు తెరపై రాలేదు అనేలా ఉంటుందని ఊరిస్తున్నారు కూడా.


మరోవైపు ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడనేదీ బలంగా వినిపిస్తోంది. దేవర అనేది తండ్రి పాత్ర పేరు అంటున్నారు. అతన్ని అంతం చేస్తే రివెంజ్ తీర్చుకునే కొడుకు వస్తాడు. ఈ లైన్ పాతగానే అనిపిస్తున్నా.. కొరటాల మార్క్ ట్రీట్మెంట్ యాడ్ అయితే ఏదైనా కొత్తగా మారిపోతుంది. ఇక భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా శ్రీదేవి కూతురు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను తీసుకున్నారు. తనకు ఇదే ఫస్ట్ సౌత్ మూవీ. విలన్ గానూ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు.


ఇక ఈ చిత్రంలో ఇప్పటి వరకూ జాన్వీ కపూర్ షూటింగ్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేయలేదు. ఆ మధ్య ఓ రెండు రోజులు మాత్రం కొన్ని సీన్స్ కోసం రప్పించారు. మరి తనతో కాంబినేషన్ సీన్స్ తో పాటు పాటల విషయం ఏంటీ అంటే.. ప్రస్తుతం వినిపిస్తోన్న దాన్ని జాన్వీ కపూర్ దేవర సెట్స్ లో అడుగుపెట్టేది దసరా తర్వాత అని తెలుస్తోంది. అప్పటి వరకూ ఎన్టీఆర్ కు సంబంధించిన సోలో పార్ట్ అంతా పూర్తి చేస్తారు. దసరా తర్వాత అంటే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి జాన్వీతో సీన్స్ ఉంటాయట. ఈ చిత్రాన్ని ఎలాగైనా డిసెంబర్ వరకూ పూర్తి చేయాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయి ఉన్నాడు ఎన్టీఆర్. అందుకే ఇంత వేగంగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. దేవర తర్వాత బాలీవుడ్ లో వార్2కు వెళ్లాలి. ఇక దేవరను 2024ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు.

Related Posts