మెగాస్టార్ తో అనుష్క ఫిక్స్

భోళా శంకర్ పోయినప్పుడు మొదట ఫీల్ కాలేదు కానీ తర్వాత విషయం అర్థమైంది మెగాస్టార్ కు. తనను వింటేజ్ మెగాస్టార్ గా ఉంటేనే చూస్తారు అన్న అతని ఓవర్ కాన్ఫిడెన్స్ ను తీసేసింది భోళా శంకర్. సినిమాలో విషయం లేకపోతే వింటేజ్ అయితే ప్రెజెంట్ ఏజ్ అయినా పట్టించుకోరు అన్న విషయం స్పష్టంగా అర్థమైంది. అందుకే ఆల్రెడీ ఆ తరహా కథాంశంతో కమిట అయిన కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టాడు. ఈ మూవీ తర్వాత చేయాల్సిన వశిష్ట ప్రాజెక్ట్ ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఇందుకోసం హీరోయిన్ లను వెదికు పనిలో ఉన్నారు మేకర్స్.


ఇక ముందు నుంచీ వినిపిస్తున్నట్టుగా ఈ చిత్రంలో మెగాస్టార్ కు జోడీగా దేవసేన అనుష్క ఫిక్స్ అయింది. ఈ మేరకు అగ్రిమెంట్స్ కూడా అయ్యాయట. అయితే ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని టాక్. ఆ ఇద్దరి కోసం మృణాల్ ఠాకూర్, ఐశ్వర్య రాయ్ లను తీసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంకా వాళ్లు ఓకే చెప్పలేదు.


ఇక భోళా శంకర్ ఎఫెక్ట్ వల్ల అని కాదు కానీ.. వశిష్ట ఈ చిత్రం కోసం ఓ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇది జగదేకవీరుడు అతిలోక సుందరి తరహాలోవస్తోన్న సోషియో ఫాంటసీ మూవీ. అందుకు తగ్గట్టుగానే.. చిరంజీవి వయసును కూడా దృష్టిలో పెట్టుకునే సినిమా ఉంటుందట. మెగాస్టార్ రెగ్యులర్ రొమాంటిక్ సీన్స్ కానీ, ఆ తరహా కామెడీ కానీ అస్సలు ఉండదని తేల్చేశాడు. చిరంజీవి అభిమానులతో పాటు నేటి తరం చిన్న పిల్లలు కూడా అత్యంత ఇష్టంగా చూసేలా ఈ చిత్రాన్ని తీర్చి దిద్దబోతున్నట్టు చెప్పాడు. ఈ మేరకు ఈ సారి ఫ్యాన్స్ కాస్త నమ్మకంగా ఉండొచ్చేమో.. మొత్తంగా ఆ ఇద్దరు హీరోయిన్లు కూడా ఓకే చెబితే ఇక రంగంలోకి దిగుతారట.

Related Posts