అఖిల్ మరో రాంగ్ స్టెప్

వరుస ఫ్లాపులతో ఉక్కిరి బిక్కిరవుతున్నాడు అక్కినేని అఖిల్. చివరగా వచ్చిన ఏజెంట్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది ఆల్ టైమ్ టాలీవుడ్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరింది. రిలీజ్ నెలలవుతున్నా.. ఓటిటి విడుదలకు కూడా నోచుకోలేదు. చివరికి చాలా అంటే చాలా పాలిష్ ల తర్వాత ఫైనల్ గా ఓటిటికి మూవ్ అయింది. సోని లివ్ వాళ్లు ఆ చిత్రాన్ని స్ట్రీమ్ చేయబోతున్నారు. ఇక నెక్ట్స్ ఏంటా అనుకున్నప్పుడు ఓ కొత్త దర్శకుడితో మైత్రీ బ్యానర్ లో భారీ బడ్జెట్ సినిమా చేయబోతున్నాడు అన్నారు. బట్ ఆ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏం కనిపించడం లేదు. ఈ లోగా మరో న్యూస్ వినిపిస్తోంది.

తనలాగే కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తోన్న ఒకప్పటి టాప్ డైరెక్టర్ లింగుస్వామితో సినిమా చేయబోతున్నాడు అనేదే ఆ వార్త. మామూలుగానే తమిళ్ డైరెక్టర్స్ ఎవరూ తెలుగులో హిట్స్ కొట్టడం లేదు. ఈ లింగుస్వామి ఒకప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ అనిపించుకున్నా.. తర్వాత ట్రాక్ తప్పాడు. ఇండస్ట్రీలో ఒక్కసారి ట్రాక్ తప్పితే గతం ఎవరూ గుర్తించుకోరు. అది లింగుస్వామికీ అనుభవం అయింది. తమిళ్ లో ఏ హీరో పట్టించుకోలేదు. దీంతో తెలుగులో గజినీలా ట్రై చేసి చివరికి రామ్ పోతినేనిని ఒప్పించి అతనితో ది వారియర్ తీశాడు. ఇదీ డిజాస్టర్. ఇలాంటి దర్శకుడితో సినిమా కోసం అఖిల్ చర్చలు జరుపుతున్నాడు అనే వార్త అక్కినేని అభిమానుల్లో ఉన్న ఆశలను కూడా చంపేస్తుంది.


ప్రస్తుతం అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన వార్తలేవీ బలంగా వినిపించడం లేదు. అసలు చేస్తున్నాడా లేదా అనే ఖచ్చితమైన స్పష్టత కూడా లేదు. ఇలాంటి టైమ్ లో లింగుస్వామితో సినిమా చర్చలు అనేది రాంగ్ డెసిషన్ అనే అంటారు. కొన్నిసార్లు ఫ్లాప్ డైరెక్టర్స్ తో చేస్తేనే హిట్ వస్తుందంటారు. అలా తన కెరీర్ లో కొంత వరకూ బెటర్ అనిపించుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ దర్శకుడు భాస్కర్ కూడా అంతకు ముందు ఫ్లాపుల్లోనే ఉన్నాడు. ఆ కారణంగా లింగుస్వామి వైపు మొగ్గు చూపుతున్నాడా అనేది చెప్పలేం కానీ.. లింగుస్వామి చెప్పిన యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీకి అఖిల్ ఫిట్ అవుతాడు అనే నమ్మకంతో అతను ఉన్నాడట. మరి ఈ ఫ్లాప్ కాంబో సెట్ అయితే బయ్యర్స్ కూడా భయపడతారేమో

Related Posts