‘కల్కి‘ కొత్త తేదీపై క్లారిటీ వచ్చేది ఎప్పుడు?

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి‘ చిత్రం వాయిదా పడినట్టు ప్రచారం జరుగుతోన్నా.. ఇప్పటివరకూ చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటనైతే రాలేదు. అసలు మే 9న ఈ చిత్రం విడుదలకావాల్సి ఉంది. నిర్మాణ సంస్థ వైజయంతీకి బాగా కలిసొచ్చిన తేదీ ఇది.

కానీ.. తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశంలో ఎన్నికల వేడి మొదలవ్వడంతో మే 9 నుంచి ‘కల్కి‘ వాయిదా వేద్దామనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే.. ఈ చిత్రానికి సంబంధించి కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారనే ఆసక్తి రెబెల్ స్టార్ అభిమానుల్లో ఉంది.

దాదాపు ఆరు వేల సంవత్సరాల కాలానికి సంబంధించిన కథతో ‘కల్కి‘ని తీర్చిదిద్దుతున్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా దీపిక పదుకొనె, దిశా పఠాని నటిస్తున్నారు.

ఇతర కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కనువిందు చేయనున్నారు. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts