బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్‘ వసూళ్ల ప్రభంజనం

సంక్రాంతి బరిలో చిన్న సినిమాగా విడుదలైంది ‘హనుమాన్‘. అయితే.. కలెక్షన్ల విషయంలో మాత్రం పెద్ద సినిమాలకు మించిన రీతిలో దూసుకెళ్తుంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. చాలా తక్కువ స్క్రీన్లతో.. తక్కువ టికెట్ రేట్లతో ఈ రేంజ్ వసూళ్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు.

మరోవైపు ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ మార్కును దాటేసింది. అక్కడ కూడా పెద్దగా ప్రీమియర్స్ లేకుండానే ఈ ఫీట్ సాధించడం విశేషం. మొత్తంగా.. రోజు రోజుకూ వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్‘ దూకుడు పెరుగుతూనే ఉంది. స్క్రీన్స్ కూడా పెరుగుతూనే ఉంది. ఈ రూ.100 కోట్లు వసూళ్లు.. మరికొద్ది రోజుల్లోనే డబుల్, ట్రిపుల్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మొత్తంమీద.. టాలీవుడ్ నుంచి ‘కార్తికేయ 2‘ తర్వాత మరో చిన్న సినిమా ‘హనుమాన్‘ రూపంలో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించబోతుందన్నమాట.

Related Posts