‘దేవర‘ గ్లింప్స్.. సముద్రం నెత్తుటితో ఎర్రబడింది

‘ఈ సముద్రం చేపల్ని కంటే.. కత్తుల్ని.. నెత్తురునే ఎక్కువ చూసుండాది.. అందుకేనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు.‘ అంటూ ‘దేవర‘ గ్లింప్స్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ‘దేవర‘ ఫస్ట్ పార్ట్.. వేసవి కానుకగా ఏప్రిల్ 5న విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా.. ఈ చిత్రం నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసింది టీమ్.

‘యు నెవర్ టచ్ ది సీ.. యు నెవర్ ప్లే విత్ మీ.. ఐ విల్ నెవర్ షో యూ మెర్సీ.. ఐ విల్ నెవర్ లెట్ యు బీ.. బ్లెడ్ ఈజ్ పూరింగ్ డౌన్.. ది సీ ఈజ్ ఫుల్ ఆఫ్ బ్లెడ్.. ఇట్స్ హిజ్ రెడ్ సీ…‘ అంటూ అనిరుధ్ స్వరకల్పనలో ఇంగ్లీష్ లిరిక్స్ తో మొదలైన గ్లింప్స్ ఆద్యంతం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. తారక్ నెవర్ బిఫోర్ మేకోవర్ తో అదరగొడుతున్నాడు. ఈ చిత్రం లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, మురళీ శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related Posts